
రాంచీ: భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఇటీవలే 5 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాలు ఫ్రకారం ముఖ్యమంత్రి రఘవర్ దాస్ సార్ధ్యంలోని బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. తిరిగి అధికారం చేపట్టేందుకు కావాల్సిన 41 స్థానాలు బీజేపీకి దక్కలేదు. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. 41 మ్యాజిక్ ఫిగర్‌ను ఈ కూటమి దాటేసింది. జార్ఖండ్ వికాస్ మోర్చా, ఏజేఎస్‌యూ, బీఎస్పీ తదితర పక్షాలు కూడా మెరుగైన ఫలితాలు సాధించాయి. హేమంత్ సొరేన్ జార్ఖండ్‌కు కాబోయే సీఎం అని ప్రచారం జరుగుతోంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైంది. బీజేపీ మరో రాష్ట్రాన్ని కోల్పోయింది. ఏడాది కాలంలో బీజేపీ మధ్యప్రదేశ్‌ను, రాజస్థాన్‌ను, ఛత్తీస్‌గఢ్‌ను, మహారాష్ట్రను కోల్పోయింది. స్వయంగా మోదీ, అమిత్ షా ఉధృతంగా ప్రచారం చేసినా జార్ఖండ్‌ను తిరిగి దక్కించుకోలేకపోయారు.
झारखंड में कांग्रेस और JMM का गठबंधन राजनीतिक अवसरवादिता का गठबंधन है जिसका उद्देश्य है किसी भी तरह सत्ता प्राप्त करना और प्रदेश को लूटना।
भाजपा के 5वर्ष के कल्याणकारी शासन से आज पूरे प्रदेश में भाजपा को गजब का समर्थन मिल रहा है। बाघमारा (धनबाद) में आयोजित जनसभा की कुछ तस्वीरें। pic.twitter.com/vEeDtfEDzw
— Amit Shah (@AmitShah) December 14, 2019
పౌరసత్వ సవరణల చట్టం నిరసనలు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించి ఉండవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Be the first to comment