షిర్డీలో బంద్ విరమణ

షిర్డీ: షిర్డీ సాయి భక్తులకు శుభవార్త. బంద్ విరమిస్తున్నట్లు షిర్డీ ప్రజలు ప్రకటించారు. సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. అంతకు ముందు షిరిడీ గ్రామస్థులు, స్థానికులు నేటి నుంచి నిరవధిక బంద్‌ తలపెట్టారు. రాత్రి 8 గంటల వరకూ బంద్ కొనసాగించాక విరమించారు. సాయిబాబా జన్మస్థలమైన పత్రిలో భక్తుల సౌకర్యార్థం భవనాల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామంటూ సీఎం ప్రకటించడంతో షిర్డీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రి అభివృద్ధితో షిర్డీ ఆలయ ప్రాశస్త్యం తగ్గిపోతుందేమోనని షిరిడీ, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పత్రి సాయిబాబా జన్మస్థలమన్న వ్యాఖ్యలను ఉద్ధవ్‌ ఉపసంహరించుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ సమయంలో అలయ పరిసరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధర్మశాలలు మూసి ఉన్నాయి. అయితే దర్శనాలు, పూజలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ ట్రస్టు ప్రకటించింది. బంద్ ప్రభావం ఆలయంపై ఉండబోదని ట్రస్టు సీయీవో దీపక్‌ ముగాలికర్‌ చెప్పారు. బంద్‌కు బీజేపీ మద్దతిచ్చింది.

వివాదాన్ని పరిష్కరించేందుకు ట్రస్టుతో సీఎం ఠాక్రే చర్చలు జరుపుతారని మహారాష్ట్ర సీఎంవో ఇప్పటికే ప్రకటించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*