స్వామి వివేకానంద — అంతర్ దృష్టి గల విజ్ఞాని .

స్వామి వివేకానంద -అంతర్ దృష్టి గల విజ్ఞాని. విజ్ఞాన శాస్త్రం.. ప్రపంచ అభివృద్ధి లో నూ సౌకర్యాలను సమకూర్చడంలోనూ మానవ ఆయు: ప్రమాణాన్ని పెంచి ప్రకృతిరహస్యాలను సాధించడంలో అన్ని రకాలుగా మానవులకి సహాయం చేసింది… అలాంటి వైజ్ఞానిక ఆవిష్కరణ ఎప్పుడూ రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది.. ఒకటి ప్రయోగాల ద్వారా… మరొకటి అంతర్ దృష్టి ద్వారా. ఐన్ స్టీన్ ఆవిష్కరణ అంతర్ దృష్టి (intuition) ద్వారా నే జరిగింది.. అయితే ఇలాంటి ఆవిష్కరణలు నిరూపించబడడానికి చాలా సమయమే పట్టినా అవి వైజ్ఞానిక రంగం లో విప్లవానికి కారణమవుతాయి. అలాంటి మహాత్ములలో స్వామి వివేకానంద కూడా ఒకరు… ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తారు.. ఆయనకి విజ్ఞాన శాస్త్రానికి ఏంటి సంబంధం??? ఆయన ఆధ్యాత్మిక వేత్త కదా… అవును. ఆయన ఆధ్యాత్మిక వేత్త, ఆత్మజ్ఞాని.. ప్రతి ఒక్కరిలో దివ్యత్వాన్ని గురించి ప్రబోధించిన ప్రవక్త.. కానీ ఆయనలో వైజ్ఞానిక భావాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు… కానీ స్వామి వివేకానంద లాంటి యుగ పురుషులని ఏ ఒక్క రంగానికో పరిమితం చేయలేం.. అది మహా సముద్రం.. స్వామీజీ లో ఇలాంటి భావాలని ఆయన జీవితం లోని సంఘటనల ద్వారా, అనేక ఉపన్యాసాల ద్వారా, తన శిష్యులతో జరిపిన చర్చల ద్వారా గ్రహించవచ్చు….. ఏ విషయమైనా స్వయంగా పరిశీలించి తెలుసుకునే తత్వం : నరేంద్రుని (స్వామి వివేకానంద బాల్య నామం) జీవితంలో జరిగిన ఈ సంఘటన ద్వారా ఆయన ఏ విషయమైనా స్వయంగా పరిశీలించనిదే ఎవరు ఏం చెప్పినా నమ్మని విషయం మనకి అర్థం అవుతుంది.. ఇది వైజ్ఞానిక దృక్పథం విజ్ఞానులు ఎవరైనా వ్యక్తులకి అహంకారాలకి నమ్మకాలని కాకుండా సత్యాన్ని మాత్రమే విశ్వసించాలి… ఆ సత్యాన్ని స్వయంగా తెలుసుకునే వరకు స్వయంగా పరీక్షించే వరకు అంగీకరించకూడదు. ఈ విధంగానే ఒకేసారి తన స్నేహితులతో ఆడుకునే సమయంలో ఒక ముసలితాత వారిని భయపెట్టటం మిగిలిన బాలురు పారిపోయిన తర్వాత కూడా నరేంద్రుడు అది పరీక్షించి ఆ తాత చెప్పింది అబద్ధమని నిరూపించడం ఆయనలోని వైజ్ఞానిక దృక్పథాన్ని బుుజువు చేస్తుంది. అదే విధంగా శ్రీ రామకృష్ణులని గురువుగా అంగీకరించేముందు ఆయనని కూడా పరీక్షించారు..

ఉపన్యాసాలలో, చర్చలలో వైజ్ఞానిక అంశాలపై అవగాహన మరియు దూరదృష్టి వెల్లడి కావడం: స్వామి వివేకానంద ఉపన్యాసాలలో జ్ఞానయోగం చాలా ముఖ్యమైనది మరియు విస్తృతమైనది. అందులో అనేక సందర్భాలలో ఆయన సృష్టి రహస్యాల గురించి వివరించారు. కొన్ని సందర్భాలలో శిష్యులతో జరిగిన చర్చలలో కూడా నికోలా టెస్లా, కెల్విన్ వంటి విజ్ఞానులతో జరిగిన చర్చలలో ఆయన వైజ్ఞానిక మేధ ప్రపంచానికి వెల్లడి అయింది… 1. జీవ పరిణామ సిద్ధాంతం గురించి : స్వామీజీ జ్ఞాన యోగ ఉపన్యాసంలో మనిషి నిజ తత్వం గురించి వివరిస్తూ ప్రతి పరిణామానికి ముందు ఒక సంకోచ దశ ఉంటుంది అంటారు. ఒక ఏకకణ జీవి నుండి మనిషి రావడం నిజమైతే ఆ మనిషిని తయారు చేసే శక్తి కానీ, పదార్థం కానీ ఆ ఏకకణ జీవి లో సంకోచ దశలో ఉంటుంది. సమయం అనుకూలించగానే అది వ్యక్తీకరించబడుతుంది. ఒక జీవి మరొక జీవిగా మారుతుంది అనుకుందాం. ఆ జీవి మరొక జీవిగా మారడానికి కావలసినదంతా ముందే సంకోచ దశలో ఉంటుంది, బాహ్య పరిస్థితులని బట్టి అది అనేక రకాలుగా మారుతుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా జన్యు పదార్థం లో వల్ల పరిణామం జరుగుతుందని అంగీకరించింది. 2. మరొకసారి స్వామీజీ తన శిష్యులతో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం గురించి కూడా వివరించారు డార్విన్ తన సిద్ధాంతం లో మనుగడ కోసం పోరాటం, బలమైనదే గెలవడం, ప్రాకృతిక ఎంపిక గురించి మాట్లాడారు. కానీ మానవుల విషయంలో డార్విన్ సిద్ధాంతం జంతువులకి వర్తించినట్టు గా వర్తించదు. జంతు ప్రపంచంలో పది జంతువులని చంపినదే బలమైనదిగా నిలుస్తుంది. కానీ పరిణామం లో అత్యున్నతమైన మానవులలో పరిణామం పది మందిని చంపడమో, అణిచివేయడం ద్వారానో కాకుండా త్యాగం సేవ పదిమందికి సహాయం చేయడం ద్వారా జరుగుతుందని వివరించారు. భారతీయ విజ్ఞానం శారీరక పరిణామం మాత్రమే కాక మనసును ఆత్మను కూడా పరిగణన లోకి తీసుకుంటుందని అర్థం చేసుకోవచ్చు… . 3. అణువుల కూర్పు; శరీర నిర్మాణం గురించి. : ఆధునిక కణ శాస్త్ర విజ్ఞానం (cell biology) పరిశోధనల్లో మానవ జంతు వృక్ష శరీరాలన్నీ కణాలతో నిర్మితమవుతాయని ఆ కణాలు జీవాణువులతో, జీవ అణువులు రసాయనాలతో నిర్మితమవుతాయని అని నిరూపించింది.. కానీ స్వామీజీ జ్ఞానయోగంలో ఈ విషయం గురించి ఇలా అంటారు. ఆ రసాయన పదార్థాలని జీవ అణువులుగా, జీవ అణువులని శరీరం లాగా కూర్చినది ఏ శక్తి? ఏ శక్తి వలన ఆ పదార్థాలు ఆ విధంగా కూడినాయి? సరే!! ఏకకణం విషయానికి వద్దాం! సముద్రంలో 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం రసాయనాలు పరిణామం పొందడం ద్వారా ( chemical evolution) జీవి పుట్టిందని A. I ఒపారిన్, హాల్డేన్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు.. కానీ శాస్త్ర విజ్ఞానం ఆ అణువులని ప్రయోగశాలలో తయారు చేయగలిగింది (stanley-miller experiment) కానీ ఏ చర్య వల్ల ఆ అణువులు అలా కూడినాయి? దాని వెనుక రహస్యమేంటి? అనే విషయం తెలుసుకోలేకపోయింది. ఈ విషయంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి ..ఈ విషయం గురించి 125 ఏళ్ల క్రితం ఒపారిన్ తన సిద్ధాంతం ప్రతిపాదించక ముందే, స్వామీజీ వ్యక్తం చేయడం గమనార్హం…
4. విశ్వం పుట్టుక గురించి :: ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది?? చాలా సంవత్సరాలనుండి మానవులు ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ముందు స్థిరస్థితి (steady state theory) సిద్ధాంతం, ఆ తరువాత మహా విస్ఫోటన సిద్ధాంతం (బిగ్ బ్యాంగ్) ప్రతిపాదించబడింది.. కానీ మహా విస్ఫోటనం జరగకముందు ఉన్న సూక్ష్మ అణువు ఎక్కడినుండి వచ్చింది? అది ఎందుకు విస్ఫోటనం చెందినది? ఏమీ లేని స్థితి నుండి ఏదైనా ఎలా పుడుతుంది? (ఇది జీవులకి కూడా వర్తిస్తుంది) ఇంకా సమాధానం లేని ప్రశ్నలు .. స్వామీజీ జ్ఞాన యోగంలో బ్రహ్మాండం (macrocosm )గురించి వివరిస్తూ ఇలా అంటారు. ” చెట్టుని ఉదాహరణగా తీసుకుందాం, విత్తనం నుండి చెట్టు వస్తుంది కొంతకాలానికి చెట్టు చనిపోతుంది మళ్లీ విత్తనాలను ఇస్తుంది. మళ్లీ ఆ విత్తనాల నుండి చెట్టు వస్తుంది.. ఇది ఒక వలయం లాగా సాగుతూనే ఉంటుంది.. ఇప్పుడు విశ్వానికి అన్వయిస్తే అణువు నుండి విశ్వం పుట్టింది.. మళ్లీ అణు రూపంలోకే మారుతుంది మళ్లీ విశ్వం పుడుతుంది. ఈ వలయాన్ని కల్పాలు (cycles) అంటారు…. .

Cause —> effect—> new cause

5. ముందు చెప్పిన పరిణామానికి దీనిని అన్వయించవచ్చు.. విశ్వం పుట్టడం పరిణామం (evolution) అయితే అణుదశని సంకోచదశ ( involution) అనవచ్చు.. ఇదే విధంగా ఆ సిద్ధాంతం జీవులకి కూడా వర్తిస్తుందని స్వామీజీ అంటారు. ఎలా అంటే విత్తనం నుండి మొక్క పుడుతుంది.. చెట్టు పరిణామ దశ అయితే విత్తనం సంకోచ దశ.. అంటే సంకోచదశలో ఉన్న వృక్షమే విత్తనం. అది నేలలో పడగానే కొన్ని మార్పులు చెంది చెట్టులా అవుతుంది… జంతువులలో కూడా, జీవి పరిణామం వల్ల ఆ స్థితి లో ఉంటుంది. కానీ ఆ జీవిని ఆ రూపంలో తయారు చేసే శక్తి శుక్రకణం (sperm) లోనూ, అండంలోనూ (ovum) నిక్షిప్తమై ఉంటుంది.. ఆ శక్తిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం జన్యువులు (DNA) అని వ్యవహరిస్తోంది.. స్వామీజీ మరో మాట అంటారు ఆ శక్తి తండ్రి నుండి గానీ తల్లి నుండి గానీ పూర్తిగా రాదు. కుచించబడి శిశువుకి సంక్రమిస్తుంది అని. అంటే తల్లి నుండి తండ్రి నుండి సగం సగం కలిసి జీవి తయారవుతుంది అన్నమాట. ఆ జీవి పరిణామం అయితే దాని సంకోచదశ శుక్రకణం. అంటే సంకోచదశలో ఉన్న మానవుడే శుక్రకణం. సమయం రాగానే వ్యక్తీకరించబడుతుంది…

Seed —> (soil) —> new plant —–> grown up plant ——-> new seed……. So on.

పైన ఉదహరించిన భావనలన్నీ స్వామీజీ ఉపన్యాసాలలో చర్చలలో చెప్పినవి. ఇవి కొన్ని మాత్రమే. స్వామీజీ ఉపన్యాసాలలో మరిన్ని వైజ్ఞానిక భావాలు విషయాలు అంతర్లీనమై ఉన్నాయి. స్వామీజీ ఎన్నో సందర్భాలలో విజ్ఞాన శాస్త్ర ఆవశ్యకత గురించి కూడా చెప్పారు. పరోక్షంగా ఐఐఎస్ సీ ఏర్పడడానికి స్వామీజీయే కారణం. కానీ విజ్ఞాన శాస్త్రానికి జతగా ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉండాలనీ, అలా ఉన్నప్పడే సంపూర్ణ మానవ వికాసం సాధ్యమనీ చెప్పారు. కేవలం సుఖాలు, భోగాలు కలిగినప్పుడు మానవుడు సమగ్ర శాంతి వికాసాన్ని పొందలేడు. అందువల్ల విజ్ఞాన శాస్త్రాన్ని సరిగా ఉపయోగించడానికి వివేకం అవసరం.. విజ్ఞానం, ఆధ్యాత్మికత కలిసినప్పుడు మాత్రమే సమగ్ర దేశాభివృద్ధి సాధ్యం. అందుకు పాటుపడవలసిన బాధ్యత భారతీయులుగా అందరిపై ఉంది…

Science and religion will meet and shake hands —- swami Vivekananda

– Sai Prashanthi, RK Math Volunteer

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*