కల్నల్ సంతోష్ విషయంలో మాటిచ్చి నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్

kcr telangana cm colonel santosh babu family

హైదరాబాద్, సూర్యాపేట: లడక్ గల్వాన్ లోయలో చైనా కుట్రపూరితంగా చేసిన దాడిలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరామర్శించారు. సూర్యాపేటలోని కల్నల్‌ సంతోష్‌బాబు నివాసానికెళ్లిన సీఎం కల్నల్ కుటుంబసభ్యులను పరామర్శించారు. కల్నల్ సతీమణి సంతోషితో, కల్నల్ సంతోష్ తల్లిదండ్రులతో సీఎం మాట్లాడారు. ఓదార్చారు. తాను మాట ఇచ్చినట్లుగానే రూ.5 కోట్ల చెక్కు, నివాస స్థల పత్రాలు కల్నల్ కుటుంబానికి అందజేశారు. అంతేకాదు కల్నల్‌ కుటుంబానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 711 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. సంతోష్‌ భార్య సంతోషికి గ్రూప్‌-1 ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం అందజేశారు. అంతకు ముందు కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సీఎం కేసీఆర్ తమను పరామర్శించడానికి తమ ఇంటికి రావడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని సంతోష్‌ బాబు తల్లి అన్నారు.

మరోవైపు తమను పరామర్శించిన సీఎం కేసీఆర్‌కు కల్నల్ సంతోష్ కుమార్ సతీమణి సంతోషి ధన్యావాదాలు తెలిపారు. గల్వాన్ లోయలో అమరులైన ఇతర జవాన్లకు కేసీఆర్ ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ తన పిల్లలతో కూడా కొద్దిసేపు గడిపారని సంతోషి చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*