
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకింది. హైదర్ అలి, హరిస్ రౌఫ్, శాదబ్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. రావల్సిండిలో ఆదివారం టెస్టులు చేసినప్పుడు వీరికి ఏ లక్షణాలూ లేవు. వాస్తవానికి లండన్ టూర్‌కు వెళ్లాల్సిన జట్టులో వీరు కూడా ఉన్నారు. అయితే జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో టూర్ వాయిదా పడే అవకాశాలున్నాయి.
Update on players’ Covid-19 testshttps://t.co/3hCnacF0uK pic.twitter.com/uFKkun6oir
— PCB Media (@TheRealPCBMedia) June 22, 2020
ఇటీవల కాలం వరకూ ఇంగ్లాండ్ కూడా కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ప్రధానమంత్రి జాన్సన్ కూడా మరణపు అంచులదాకా వెళ్లి బతికి బయటపడ్డారు. ఈ నేపథ్యంలో పాక్‌తో జరగబోయే సిరీస్‌ను రద్దు చేసే అవకాశాలున్నాయి.
Be the first to comment