ఏంటి నీ స్టేటస్?? ముందు నీ స్టేటస్ ఏంటో చూపించు !

స్టేటస్… ఇప్పుడు ఓ ట్రెండ్. అయితే ఈ స్టేటస్ … ఆస్తిపాస్తులతో సంబంధం లేనిది.

కేవలం కొందరిదే కాదు దాదాపు అందరిది. ఒక్క మాటలో చెప్పాలంటే … స్మార్ట్ ఫోన్ వున్న ప్రతి ఒక్కరిది.

ఈ మధ్య వాట్సాప్ వాడని వారు లేరంటే నిజం. పిల్లల దగ్గరి నుంచి దాదాపు ప్రతి పదిమందిలో ఎనిమిది మందికి వాట్సాప్ అకౌంట్ ఉంది. దానికో ప్రొఫైల్ పిక్ ఉంది. స్టేటస్ అనే ఆప్షన్ ఉంది. ఆ స్టేటస్ ఇప్పుడో క్రేజ్ గా మారింది.

24 గంటల పరిధి మాత్రమే వుండే ఆ స్టేటస్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ తెగ బిజీ అయ్యారు వాట్సాప్ యూజర్స్. రోజూ తమ స్టేటస్ ను మారుస్తూ.. తమ మదిలోని భావాలను బయటపెడుతున్నారు.

అంతేకాదు వెరైటీ వీడియోస్, ఫొటోస్, న్యూస్, మంచి మాటలు, సూక్తులు, బర్త్ డే, మ్యారేజ్ డే విషెస్, చరిత్రలో ఆ రోజు ప్రత్యేకతను టెక్స్ట్ చేస్తున్నారు.

ఒక్కొక్కరికి మెసేజ్ ఫార్వర్డ్ చేసే బదులు, స్టేటస్ లో పెడితే చాలు, ఒకేసారి ఎంతమంది అయినా చూసే ఛాన్స్ ఉండడంతో స్టేటస్ కి క్రేజ్ పెరిగిపోతోంది .

వీడియోలకు కేవలం సెకండ్స్ లిమిట్ ఉండడం తో.. ఆ టైం ను విరివిగా వాడేస్తున్నారు. ఎడిటింగ్ చేసిమరీ తమ టాలెంట్ ను స్టేటస్లో పెట్టేస్తున్నారు.

ఇక యూత్ తమ టాలెంట్ వీడియోస్, పాటలు, డాన్స్ అన్ని స్టేటస్ కి ఎక్కించేస్తున్నారు.

ఈ స్టేటస్ అప్డేట్ ఎంత మంది చూసారు, ఎవరెవరు చూసారో కూడా తెల్సుకునే అవకాశం ఉండడంతో… ఇక ఇదే పనిలో పడ్డారు. ఒకవేళ ఎవరి స్టేటస్ అయినా నచ్చితే లైక్.. నచ్చకపోతే కామెంట్ చేయవచ్చు.

కేవలం యూత్ కాదు.. దాదాపు అన్ని వయసుల వారు ఈ స్టేటస్ మేనియా లో పడ్డారు. నచ్చిన వాటిని స్టేటస్ లో పెట్టడం… ఇప్పుడో కొత్త స్టేటస్.

మంజీత కుమార్ బందెల

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*