ఇక పై ప్రతి వస్తువు యొక్క మూలదేశాన్ని పేర్కొనడం తప్పనిసరి

హైదరాబాద్ : “ఆత్మనిర్భర్ భారత్”,“లోకల్ అండ్ వోకల్ ” గత కొద్దీ రోజులుగా దేశం అంతటా వినిపిస్తున్న పదాలు,ప్రధానమంత్రి దేశ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి చేసిన ప్రసంగం తరువాత ఈ రెండు పదాలు దేశమంతటా వినిపిస్తున్నాయి,ఇందుకు తొలి మెట్టుగా కేంద్ర ప్రభుత్యం “గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్” లో ప్రతి వస్తువుకి తప్పనిసరిగా వాటి “ఉత్పత్తి దేశాన్ని” పేర్కొనాలని తెలిపింది.

గోవేర్నమెట్ ఈ-మార్కెట్ ప్లేస్ లో వస్తువులు కొత్తగా అమ్మే ప్రతి విక్రయదారుడు వారి వస్తువుల ఉత్పత్తి దేశాన్ని ముందే పేర్కొనాలని ప్రస్తుతం ఉన్న విక్రయదారులు వారి ఉత్పత్తి దేశానికి చెందిన వివరాలను పునరుద్ధరించాలని కోరింది.

వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మార్పులను చేసింది,కొనుగోలు దారుడు ప్రతి వస్తువులో ఎంత శాతం దేశీయ ఉత్పత్తులు వాడారో కూడా తెలుసుకోవచ్చని తెలిపింది అంతేకాకా “మేక్ ఇన్ ఇండియా” అనే కొత్త ఫిల్టర్ను ప్రవేశించామని దాని ద్వారా కేవలం దేశీయ వస్తువులనే కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్యం చైనా కి చెందిన మొబైల్ యాప్స్ ని గూగుల్ ప్లే నుండి తీసేయాలని కోరిందంటూ దాని సంబందించిన ధ్రువపత్రాలు సైతం సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి కానీ అది నిజం కాదని వాటిని నమ్మరాదని “పి ఐ బి” స్పష్టం చేసింది.

-అనుదీప్ శర్మ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*