టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడికి ప్రతిష్టాత్మక పురస్కారం

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ యువ నేత, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి సంసద్ రత్న పురస్కారం దక్కింది. అతి పిన్న వయసులోనే ఆయన ఈ అవార్డు నెగ్గారు. దేశవ్యాప్తంగా ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఈ అవార్డు గెలుచుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ నేతృత్వంలోని కమిటీ అవార్డులను ప్రకటించింది. రామ్మోహన్ నాయుడు టీడీపీ సీనియర్ నేత, దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు. అవార్డు గెలుచుకున్న మిగతా వారిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే, శశిథరూర్, అజయ్ మిశ్రా తదితరులున్నారు.

ప్రత్యేక హోదా సమయంలో హిందీలో అనర్గళంగా ప్రసంగిస్తూ కేంద్రాన్ని నిలదీశారు. ఉత్తరాది ఎంపీలైతే రామ్మోహన్ నాయుడు ఉత్తరాది వాడేనని అనుకునేంతలా ఆయన ప్రసంగించారు. రామ్మోహన్ నాయుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకోవడంతో ఆయనకు హిందీపై పట్టువచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఆకర్షణీయ యువ నేతల్లో ఒకరుగా, సమర్థుడైన నాయకుడిగా రామ్మోహన్ నాయుడు పేరు తెచ్చుకున్నారు. తండ్రి ఎర్రన్నాయుడు తరహాలోనే రామ్మోహన్ నాయుడు పేరు తెచ్చుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*