
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరోసారి లాక్డౌన్ విధించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని 3, 4 రోజుల్లో ఖరారు చేయాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని కేసీఆర్ తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని, అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని కేసీఆర్ చెప్పారు. జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువేనన్నారు. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదని, పాజిటివ్‌గా తేలిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో మరోసారి 15రోజుల పాటు లాక్డౌన్ విధించాలని వైద్యవర్గాలు ప్రభుత్వానికి సూచించాయి.
జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. pic.twitter.com/sPWAwgzj9Z
— Telangana CMO (@TelanganaCMO) June 28, 2020
సికింద్రాబాద్ జనరల్ బజార్లో హోల్‌సేల్ వ్యాపారులు ఇప్పటికే తమ దుకాణాలను మూసేశారు. బేగంబజార్‌తోపాటు పలుచోట్ల వ్యాపారవేళలు తగ్గించుకోవాలని వ్యాపారులు నిర్ణయించుకున్నారు.
తెలంగాణలో ఇప్పటివరకూ 13, 498 మందికి కరోనా సోకింది. 4, 928 మంది కోలుకున్నారు. 243 మంది చనిపోయారు.
Be the first to comment