
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణపై చైనాకు మోదీ సర్కారు షాకిచ్చింది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, హెలో, వైబో, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, డియూ బ్రౌజర్, డియూ క్లీనర్, వివో వీడియో, డియూ బ్యాటరీ సేవర్, లైకీ, న్యూస్ డాగ్, వుయ్ చాట్ తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. మీ మొబైల్ ఫోన్లలో చైనా యాప్‌లుంటే వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే ఆ యాప్లుండటం చట్ట విరుద్ధం.
List of 59 apps banned by Government of India "which are prejudicial to sovereignty and integrity of India, defence of India, security of state and public order”. pic.twitter.com/p6T2Tcd5rI
— ANI (@ANI) June 29, 2020
భారత్-చైనా కమాండర్ల స్థాయి మూడో దఫా చర్చలు మంగళవారం ఉదయం పదిన్నరకు ప్రారంభం కానున్న తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో డ్రాగన్ కంట్రీ షాకయింది. జూన్ 15న లడక్ గల్వాన్ లోయ నుంచి బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది.
గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత ఎల్ఏసీ వెంబడి 3,500 కిలోమీటర్ల వరకూ విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా భారత్ నిఘా పెంచింది.
Be the first to comment