జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో హైలైట్స్

న్యూఢిల్లీ:జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో నిరుపేదలకు శుభవార్త చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకోసం రానున్న ఐదు నెలల పాటు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, కిలో చక్కర ఉచితంగా పంపిణీ చేస్తామని మోదీ చెప్పారు. దీని వల్ల 80 కోట్ల మంది పేదలకు మేలు జరుగుతుందన్నారు. సరైన సమయంలో లాక్‌డౌన్ విధించడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగామాని ప్రధాని చెప్పారు. కరోనాపై ప్రారంభంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు కనపడిన భారతీయులు ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. అందరూ మాస్కు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పక పాటించాలని మోదీ సూచించారు. బల్గేరియా దేశ ప్రధాని బొరిస్సోవ్ చర్చ్‌లో మాస్క్ పెట్టుకోలేదని 13 వేల రూపాయల ఫైన్ వేసిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. గ్రామీణుడికైనా, దేశ ప్రధానికైనా నిబంధనలు ఒకేలా ఉండాలని మోదీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనల విషయంలో కఠినంగా ఉండాలని ప్రధాని సూచించారు.

జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో హైలైట్స్
……………………………………………….
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 80 కోట్ల నిరుపేదలకు సాయం
5 నెలల పాటు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు కిలో చక్కర ఉచితం
కరోనాపై నిర్లక్ష్యం తగదు
మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
రెండు గజాల దూరం పాటించాలి.
కరోనా వేళ గ్రామీణుడికైనా, ప్రధానికైనా ఒకటే నిబంధన
సరైన సమయంలో లాక్‌డౌన్‌తో ద్వారా లక్షల మంది ప్రాణాలు కాపాడాం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*