మీ అభిమాన రేడియో జాకీల ఇంటర్వ్యూలు, ఆసక్తికర కథనాలు… ప్రతి ఆదివారం … ఈ క్షణంలో..

రెయిన్ బో ఎఫ్ఎం

రేడియో మిర్చీ

బిగ్ ఎఫ్ఎం

రేడియో సిటీ

రెడ్ ఎఫ్ఎం….

ఇలా ఎన్నెన్నో ఎఫ్ఎం ఛానెల్స్ మనల్ని అలరిస్తున్నాయి. ముఖ్యంగా రేడియో జాకీలు మనల్ని మళ్లీ రేడియోలకు అతుక్కుపోయేలా చేశారు. స్మార్ట్‌ఫోన్లలోనూ ఎఫ్ఎం అందుబాటులోకి రావడంతో యువత ఫోన్‌లను వదిలిపెట్టలేకపోతున్నారు. ఇలా ఎఫ్ఎంలకు అతుక్కుపోయేలా చేయడంలో రేడియో జాకీలది కీలక పాత్ర. కిలాకిలా నవ్వుతూ గలగలా మాట్లాడుతూ, ఇష్టమైన పాటలు వినిపిస్తూ, బోలెడన్ని కబుర్లు చెప్పే రేడియో జాకీలు లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నారు.

తను నా ఫ్యావరెట్ ఆర్‌జే అని యూత్ అంటూ ఉండటం రోజూ వింటూనే ఉంటాం. ఇప్పుడున్న రేడియో జాకీలను ఆదర్శంగా తీసుకుని చాలామంది యూత్ తమ కెరీర్‌ను అదే రంగంలో వెతుక్కుంటున్నారు. యూత్‌నే కాదు ఇంటిల్లిపాదినీ రేడియో జాకీలు మాటల గారడీతో కట్టిపడేస్తున్నారు.

బచ్చాగాడి దగ్గర్నుంచి బామ్మదాకా అందర్నీ అంతలా ప్రభావితం చేస్తున్న రేడియోజాకీల గురించి తెలుసుకోవాలని ఎవరికుండదు. అందుకే ఈ క్షణం మీడియా మీ కోసం రేడియో జాకీలను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ప్రతి ఆదివారం ఈ క్షణంలో మీ అభిమాన ఆర్‌జేల ఇంటర్వ్యూలు, ఆసక్తికర కథనాలు అందిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*