రాష్ట్రపతితో ప్రధాని భేటీ

రాష్ట్రపతితో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మోదీ పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ప్రధాని ఇటీవల జరిపిన లడక్ టూర్ వివరాలు రాష్ట్రపతికి తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితులను వివరించారు. త్రివిధ దళాల సన్నద్ధతను కూడా ప్రధాని రాష్ట్రపతికి తెలిపారు.

లడక్ పర్యటనలో భాగంగా ప్రధాని భారత్ తరపున చైనా సైన్యంతో చర్చలు జరిపిన లెఫ్టెనెంట్ జనరల్ హరిందర్ సింగ్‌‌తో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. వాస్తవ పరిస్థితులను గ్రహించాక సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత చైనా బలగాల దాడిలో గాయపడి లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను కలుసుకున్నారు. జవాన్ల ధైర్య సాహసాలను కొనియాడారు.

రాష్ట్రపతి కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీకి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*