
బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న “రెబల్‌స్టార్” ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “రెబల్‌స్టార్” ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబల్‌స్టార్” కృష్ణంరాజు గారు సమర్పించగా, వంశి, ప్రమెద్, ప్రశీద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్నో సూపర్‌హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్ , యూవి క్రియెషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే యూరప్ లాంటి విదేశాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకొని 70% టాకీ పార్ట్ ని పూర్తిచేసకుంది. మిగతా షూటింగ్ పార్ట్ ని ఈ కొవిడ్-19 ప్రభావం క్రైసిస్ ముగిసిన వెంటనే సెట్స్ మీదకి తీసుకువెలతారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కొసం యావత్ ప్రపంచం లోని అభిమానులంతా ఎంతలా ఎదురు చూసారో చెప్పనక్కర్లేదు. ఆ క్షణం ఈరోజు రావటం తో అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. ఈరోజు ఈ చిత్రం టైటిల్ ని “రాధేశ్యామ్” అంటూ ఎనౌన్స్ చేశారు. దాంతో పాటే మెదటిలుక్ ని కూడా రిలీజ్ చేశారు.
Presenting you the title and first look of #Prabhas20#RadheShyam #Prabhas20FirstLook
Starring #Prabhas @hegdepooja
Director @director_radhaa
Presented by @UVKrishnamRaju garu #GopikrishnaMovies
Producers @UV_Creations @TSeries @itsBhushanKumar #Vamshi #Pramod @PraseedhaU pic.twitter.com/aX56HfpzNQ— UV Creations (@UV_Creations) July 10, 2020
ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవ్వనుంది.
Jab Tak Rahenge Suraj Chand,
Yaad Rahenge Ye #RadheShyam! #Prabhas20FirstLookStarring #Prabhas & @hegdepooja
Directed by @director_radhaa
Presenter @UVKrishnamRaju garu
Produced by @itsBhushanKumar @TSeries with #Vamshi #Pramod & @PraseedhaU under @UV_Creations @AAFilmsIndia pic.twitter.com/ywuY3aCaFS— TSeries (@TSeries) July 10, 2020
“రెబల్‌స్టార్” ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్
బాహుబలి రెండు పార్టుల తరువాత “రెబల్‌స్టార్” ప్రభాస్ పాన్ ఇండియాస్టార్ గా ఎదిగారు అంతే కాదు సౌత్ ఇండియాలో మెట్టమెదటి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ రికార్డ్ సాధించారు. ఆ తరువాత వచ్చిన సాహొ రెవెన్యూ పరంగా బాక్సాఫీస్ దగ్గర రెబల్‌స్టార్ ప్రభాస్ సత్తా మరోక్కసారి చాటింది. అలాగే జిల్ చిత్రం తో దర్శకుడు గా 100 మార్క్ లు వేసుకున్న దర్శకుడు రాదాకృష్ణ కుమార్, వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం రాధేశ్యాం. ఈ చిత్రం ఢిఫరెంట్ లవ్ స్టోరి గా తెరకెక్కుతుంది. మేకర్ గా మంచి గుర్తింపు పోందింన రాధాకృష్ణ కుమార్ కి రెండవ చిత్రం గా ఇది తెరకెక్కుతుంది. ఈ క్రేజి కాంబినేషన్ కొసం అభిమానుల్లో మరియు సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
గొపికృష్ణ మూవీస్-యూవిక్రియెషన్స్ నిర్మాణం లో
రెబల్‌స్టార్ కృష్ణం రాజు గారు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. గొపికృష్ణ మూవీస్ బ్యానర్ లో పలు విజయవంతమైన చిత్రాలు కృష్ణం రాజు గారు నిర్మించారు. మంచి కథాబలం వున్న చిత్రాలు నిర్మిస్తూ సక్సస్ కి కేరాఫ్ అడ్రాస్ గా నిలిచిన గొపికృష్ణ మూవీస్ బ్యానర్ ఇప్పడు లేటెస్ట్ సక్సస్ ఫుల్ నిర్మాణ సంస్థ యూవిక్రియెషన్స్ బ్యానర్ తో కలిసి నిర్మాణం చెపట్టటంతో “రాథేశ్యామ్” ట్రేడ్ లో ట్రెండ్ సెట్ట్టింగ్ ఫిల్మ్ గా క్రేజ్ ని సొంతం చేసుకుంది.
రెబల్‌స్టార్ ప్రభాస్-పూజాహెగ్డే కాంబినేషన్
రాధేశ్యామ్ అనే టైటిల్ ని వీరిద్ధరి కాంబినేషన్ చూసి పెట్టారా అనుకునేలా ఈ జంట మెదటి లుక్ లో వున్నారంటే ఆశ్చర్యం లేదు.. అంతలా ఇమిడిపోయారు ఈ స్టిల్ లో ఇటీవలే బుట్టబొమ్మ గా ప్రేక్షకుల హ్రుదయాల్ని ఆకట్టుకున్న పూజాహెగ్డే ఈ చిత్రం లో మరింతగా ఆకట్టుకుంటుంది. ప్రేమికులుగా రాథేశ్యామ్ అని అందరి ప్రశంశలు పొందే విధంగా ఈ మెదటి లుక్ ఆకట్టుకొవటం విశేషం.
#RadheShyamFirstLook #RadheShyam #Prabhas20 #Prabhas #PoojaHegde pic.twitter.com/2mRzWoVg05
— Pooja Hegde (@hegdepooja) July 10, 2020
రాధేశ్యామ్ మెదటి లుక్
“రెబల్‌స్టార్” ప్రభాస్, పూజాహెగ్డే లతో బార్బిడాల్ డాన్స్ పోజ్ తో రిలీజ్ చేసిన మెదటి లుక్ చాలా లవ్లీ గా వుండటం అందర్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రభాస్, పూజా ఇద్దరూ ప్రేమకి ప్రతిరూపంగా వుండటం.. ఎర్రటి సముద్రాన్ని గౌనుగా వాడటం దర్శకుడి క్రియెటివిటి కనిపిస్తుంది. ప్రేమని చూపిస్తూ దాని వెనక సమస్యని ఈ పిక్చర్ లో చూపించారు. చెప్పకనే చెప్పారు రెబల్‌స్టార్ రేంజి ని ఈ లుక్ ప్రపంచవ్యాప్తంగా అందర్ని ఆకట్టుకొవటం తో యూనిట్ అంతా ఆనందంగా వున్నారు.
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్కర్, భీనా బెనర్జి, మురళి శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
చిత్ర సమర్పకులు : “రెబల్‌స్టార్” డాక్టర్ యు వి కృష్ణంరాజు
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
ఎడిటర్ : కొటగిరి వెంకటేశ్వరావు
యాక్షన్, స్టంట్స్ : నిక్ పవల్
సౌండ్ డిజైన్ : రసూల్ పూకుట్టి
కొరియోగ్రఫి : వైభవి మర్చంట్
కాస్ట్యూమ్స్ డిజైనర్ : తోట విజయ భాస్కర్ అండ్ ఎకా లఖాని
వి ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ : కమల్ కన్నన్
ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : ఎన్.సందీప్
హెయిర్‌స్టైల్ : రోహన్ జగ్టప్
మేకప్ : తరన్నుమ్ ఖాన్
స్టిల్స్ : సుదర్శన్ బాలాజి
పబ్లిసిటి డిజైనర్ : కబిలాన్
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను
కాస్టింగ్ డైరక్టర్ : ఆడోర్ ముఖర్జి
ప్రోడక్షన్ డిజైనర్ : రవీందర్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రశీదా
దర్శకుడు : రాధాకృష్ణ కుమార్
This post is also available in : English
Be the first to comment