
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కిడ్నాప్‌నకు గురైన బీజేపీ నేత మెహరాజుద్దీన్ మల్లాను పోలీసులు కాపాడారు. సోపోర్ మున్సిపల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అయిన మెహరాజుద్దీన్ మల్లాను ఈ ఉదయం కారులో వెళ్తుండగా ఆయన నివాసానికి సమీపంలోనే దుండగులు కిడ్నాప్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకూ దుండగుల చెరనుంచి విడిపించారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.
Mehraj Din Malla, BJP leader & vice-president of Watergam Municipal Committee in Baramulla who was abducted earlier today has been rescued by Police: Kashmir IG Vijay Kumar (File pic) #JammuAndKashmir pic.twitter.com/HtfZyfSrZY
— ANI (@ANI) July 15, 2020
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ కూడా ట్విటర్ ద్వారా మల్లాను కాపాడిన విషయాన్ని షేర్ చేశారు.
J&K Police say they rescued BJP’s Vice President Municipal Committee Watergam Baramulla, Meraj ud Din Malla who was allegedly abducted by some unknown persons in the north Kashmir district.
— Ram Madhav (@rammadhavbjp) July 15, 2020
ఇటీవలే బండిపోరాలో బీజేపీ యువనేత వసీం బారిని, ఆయన తండ్రిని, సోదరుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో మెహరాజుద్దీన్ మల్లాకు కూడా దుండగులు ఏమైనా ప్రమాదం తలపెడతారేమో అని బీజేపీ శ్రేణులు భావించాయి. మల్లా సురక్షితంగా ఇంటికి రావడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Be the first to comment