
న్యూఢిల్లీ: ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో ఏరివేత తీవ్రమవడంతో దిక్కుతోచని ఉగ్రవాదులు బీజేపీ నేతలను టార్గెట్ చేసుకుంటున్నారు. బీజేపీ నేత మెహరాజుద్దీన్ మల్లాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. సోపోర్ బీజేపీ నేత అయిన మెహరాజుద్దీన్ మల్లాను కారులో వెళ్తుండగా ఆయన నివాసానికి సమీపం నుంచే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. మల్లా ఆచూకి కనుగొనేందుకు బలగాలు రంగంలోకి దిగాయి.
Mehraj Din Malla, BJP leader & Vice President of Municipal Committee (MC) Watergam in Sopore area of Baramulla district, abducted by unknown person today morning. Police have launched a search operation in the area: BJP Spokesperson, Kashmir. #JammuAndKashmir pic.twitter.com/KWewbjYRFQ
— ANI (@ANI) July 15, 2020
ఇటీవలే బండిపోరాలో బీజేపీ యువనేత వసీం బారిని, ఆయన తండ్రిని, సోదరుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. పది మంది సెక్యూరిటీ గార్డులున్నా ఘటన జరిగిన రోజు ఒకరు కూడా లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. తాజాగా ఇప్పుడు మెహరాజుద్దీన్ మల్లా కిడ్నాప్ అవడంతో బీజేపీ వర్గాల్లో కలకలం రేగింది. జమ్మూ కశ్మీర్లో రాజకీయ నేతలకు తగిన విధంగా రక్షణ కల్పించాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి.
Be the first to comment