అమర్‌నాథ్ యాత్ర రద్దు

శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్ర రద్దయింది. కరోనా నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తూ శ్రీ అమర్‌నాథ్ దేవస్థాన బోర్డ్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి నేడు ప్రారంభమై ఆగస్ట్ 3 వరకూ కొనసాగాలని తొలుత నిర్ణయించినా ఆఖరు నిమిషంలో రద్దు చేశారు.

ఈ నెల 18న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్వయంగా మంచు శివలింగాన్ని సందర్శించి పూజలు కూడా చేశారు. ఈ తరుణంలో యాత్ర కొనసాగుతుందనే అంతా ఆశించారు. అయితే కరోనా మహమ్మరి తీవ్రత నేపథ్యంలో అమర్‌నాథ్ దేవస్థాన బోర్డ్ రద్దు నిర్ణయం తీసుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*