
హైదరాబాద్: వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ వరకూ వీర భారత పుత్రుల విజయగాథలపై వక్తల వెబ్ ప్రసంగాలు ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకూ దేశ భక్తుల గురించి వక్తలు ప్రసంగిస్తారు. గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్ ప్రసంగాలుంటాయి. వక్తల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఆర్ఎస్ఎస్ నేతలు ఎక్కా చంద్రశేఖర్, అప్పాల ప్రసాద్, రామకృష్ణ మఠం నుంచి స్వామి శితికంఠానంద తదితరులు ప్రసంగిస్తారు.
Join the Web Lectures on India's Founding fathers & Freedom fighters on #GoogleMeet with vandemataram Foundation
Date: 1-5 Aug 2020
Time: 5-6 pm every dayWhatsapp Vandemataram to 9963272231#IndependenceDayIndia pic.twitter.com/Ht9cciIBuY
— Vandemataram Foundation (@vandemataramvmf) August 2, 2020
ఆగస్ట్ ఒకటిన ప్రారంభమైన ఈ కార్యక్రమం స్వాతంత్ర్యదినోత్సవం ఆగస్ట్ 15వరకూ కొనసాగనుందని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీంద్ర తెలిపారు. మరిన్ని వివరాలకు 9963272231 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.
వందేమాతరం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్షలాది మంది పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడేలా వందేమాతరం ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఇటీవల కరోనా సమయంలోనూ వందేమాతరం ఫౌండేషన్ నిస్సహాయులకు అండగా నిలిచింది. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసింది.
Be the first to comment