
ముంబై: మాజీ క్రికెటర్, యూపీ మంత్రి చేతన్ చౌహాన్ కన్నుమూశారు. పాజిటివ్ రావడంతో పాటు శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఆయన్ను గురుగ్రాం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు. చేతన్ చౌహాన్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్రికెటర్‌గానే కాకుండా బీజేపీ నేతగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. చేతన్ చౌహాన్ కుటుంబ సభ్యులకు ప్రధాని సంతాపం తెలిపారు.
Shri Chetan Chauhan Ji distinguished himself as a wonderful cricketer and later as a diligent political leader. He made effective contributions to public service and strengthening the BJP in UP. Anguished by his passing away. Condolences to his family and supporters. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 16, 2020
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా చేతన్ మృతిపై సంతాపం తెలిపారు. చేతన్ లేరనే దు:ఖాన్ని తట్టుకోగల శక్తిని భగవంతుడు ఆయన కుటుంబానికి ఇవ్వాలని, ఆయన ఆత్మకు శ్రీరాముడు శాంతిని చేకూర్చాలని ప్రార్ధిస్తున్నట్లు యోగి ట్వీట్ చేశారు.
पूर्व अंतरराष्ट्रीय खिलाड़ी, मंत्रिमंडल में मेरे सहयोगी, श्री चेतन चौहान जी के असामयिक निधन का व्यथित कर देने वाला समाचार प्राप्त हुआ।
प्रभु श्री राम, श्री चौहान जी के परिजनों को इस अपार दुःख को सहने की शक्ति एवं दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान प्रदान करें।
ॐ शांति
— Yogi Adityanath (@myogiadityanath) August 16, 2020
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా చేతన్ మృతిపై సంతాపం తెలిపారు.
Saddened by the passing away of Sh Chetan Chauhan Ji. He played cricket with flare and contributed towards preparing Delhi for hosting world cup T20. In his 2nd innings he made valuable contributions in public service. Sincere condolences to his family.
ॐ शांति
— Anurag Thakur (@ianuragthakur) August 16, 2020
చేతన్ చౌహాన్ క్రికెట్ రంగంలోనే కాక రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. నిత్యం చురుగ్గా ఉంటూ మిగతా రాజకీయ నాయకులకూ ఆదర్శంగా ఉండేవారు. ఆయన మరణంతో యూపీ మంచి నేతను కోల్పోయినట్లైందని బీజేపీ శ్రేణులంటున్నాయి.
Be the first to comment