
యాదగిరిగుట్ట: చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి టెక్నాలజీ ఎంతో అవసరం. అయితే అది సులభంగా అందుబాటులో లేకపోవడంతో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక చాలా మంది వ్యాపారస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన శివకుమార్ అనే బీకాం గ్రాడ్యుయేట్ దీనికో ఉపాయం కనిపెట్టి ఓ చిన్న స్టార్టప్ ప్రారంభించాడు. కౌటిల్యుడు డాట్ కామ్ పేరుతో ఓ సంస్థకు శ్రీకారం చుట్టాడు.
దీని ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు, వ్యాపారస్తులకు అకౌంటింగ్, జీఎస్టీ, టీడీఎస్, ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్‌తో పాటు కంపెనీల రిజిస్ట్రేషన్, ట్రేడ్, లేబర్ లైసన్సులు పొందే సర్వీసులందేలా చేశాడు.
https://www.kautilyudu.com
ఆయా సంస్థలు, వ్యక్తులకోసం వెబ్‌సైట్స్ తయారు చేయడం, సోషల్ మీడియా సర్వీసులు అందించడం తన స్టార్టప్‌లో భాగం చేశాడు. అంతేకాదు మొబైల్లోనే సులభంగా జీఎస్టీ బిల్లింగ్ చేసే ఆండ్రాయిడ్ యాప్, మరియూ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు.
తన సంస్థకు ఫైనాన్స్ + టెక్నాలజీ = కౌటిల్యుడు అనే ట్యాగ్‌లైన్ ఇచ్చాడు.
లాక్డౌన్ కారణంగా స్వగ్రామమైన యాదగిరిగుట్టకు వెళ్లాకే స్టార్టప్‌పై ఆలోచన వచ్చిందని చెబుతున్నాడీ కుర్రాడు.
హైదరాబాద్‌లో ఉన్నప్పుడు రామకృష్ణ మఠం కార్యక్రమాలకు టెక్నాలజీ సపోర్ట్ అందిస్తూ తాను అనేక విషయాలు నేర్చుకున్నానని చెబుతున్నాడు. యూ ట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్, ఇతర ఆన్లైన్ సర్వీసులపై సాంకేతిక విషయాలను నేర్చుకున్నాడు. రామకృష్ణ మఠానికి భౌతికంగా దూరంగా ఉన్నా ఆన్లైన్ ద్వారా మఠం కార్యక్రమాలు నిర్వఘ్నంగా కొనసాగేలా చూస్తున్నాడు. రామకృష్ణ మఠానికి స్వచ్ఛంద సేవను కొనసాగిస్తున్నాడు.
https://www.instagram.com/kautilyudu/
This post is also available in : English
Be the first to comment