పీఎం కేర్ ఫండ్స్ ఇలా వాడారు

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా ప్రపంచం నలుమూలల నుంచి భారతీయులు పీఎం కేర్ ఫండ్స్‌కు పంపిన మొత్తాన్ని ఎలా వాడిందో కేంద్రం స్పష్టం చేసింది. పీఎం కేర్ ఫండ్‌కు వచ్చిన 3100 కోట్ల రూపాయల్లో 50 వేల వెంటీలేటర్ల తయారీకి రూ.2 వేల కోట్లు, కార్మికుల సంక్షేమం కోసం రూ. 1000 కోట్లు, వ్యాక్సిన్ తయారీకి రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.

పీఎం కేర్ ఫండ్స్ నుంచి ఎన్డీఆర్ఎఫ్‌కు నిదులు మళ్లించేందుకు ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తరుణంలో కేంద్రం తాజాగా వివరాలు వెల్లడించింది.

అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పీఎం కేర్ ఫండ్స్ వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ ఆరోపణలు తిప్నికొట్టిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మన్మోహన్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఫౌండేషన్‌కు పీఎం కేర్ ఫండ్స్ నుంచి వంద కోట్ల రూపాయలు కేటాయించడాన్ని తప్పుబట్టారు. మోదీ హయాంలో పీఎం కేర్ ఫండ్స్‌కు సంబంధించి పూర్తి పారదర్శకత పాటిస్తున్నామన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*