“బాహుబలి విసిరిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను స్వీకరించిన భళ్లాలదేవ”

హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పోటిపడుతుందా అన్నట్టు ముందుకు సాగుతుంది.. రాజ్యసభ సభ్యులు, జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. ప్రతీ రోజు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోచోట ప్రకృతి ప్రేమికులంతా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ఓన్ చేస్కొని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ యేడు ప్రారంభమైన మూడో విడత “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ప్రారంభించిన బాహుబలి ప్రభాస్.. భళ్లాలదేవుడు దగ్గుబాటి రానాకు ఛాలెంజ్ విసిరారు.

యంగ్ రెబల్ స్టార్ విసిరిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను స్వీకరించిన రానా దగ్గుబాటి.. ఈ రోజు రామానాయుడు స్టూడియోలో మూడు మొక్కలు నాటారు. అనంతరం రానా మాట్లాడుతూ.. సమాజానికి మేలు చేసే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు డార్లింగ్ ప్రభాస్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో నా అభిమానులు, మా దగ్గుబాటి కుటుంబ అభిమానులు, ప్రకృతి ప్రేమికులంతా పాల్గొని ముందుకు తీసుకుపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాదు.. ఈ సంకల్పానికి నావంతు ప్రయత్నంగా ఎవరు మొక్కలు నాటి నాకు ట్యాగ్ చేసినా రీట్విట్ చేస్తానంటూ తెలియజేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*