శివపదం అంతర్జాతీయ నృత్యప్రదర్శన దివ్యానుభూతిని కలిగించింది: సామవేదం

సింగపూర్: శివపదం అంతర్జాతీయ నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్, రష్యా, దుబాయ్, యూకే, అమెరికా దేశాలలోని 16 నాట్యకళాశాలలనుంచి 73 మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు. కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యం, కథక్, కూచిపూడి నాట్యరీతులలో అభినయించారు. వివిధ దేశాలవారు చేసిన శివపద నృత్య ప్రదర్శనను ప్రపంచంలోని అందరూ ఏకకాలంలో వీక్షించేలా ఆన్‌లైన్ సౌకర్యం కల్పించారు. భారతీయకళలను తరువాతి తరాలవారికి అందజేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఋషిపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ మాట్లాడుతూ శివపదం అంతర్జాతీయ నృత్యప్రదర్శన దివ్యానుభూతిని కలిగించిందని చెప్పారు. కార్యక్రమానికి రూపకల్పన చేసిన గుండ్లపల్లి రవిగారి దంపతులను, నృత్యప్రదర్శనలో పాల్గొన్న కళాకారులను షణ్ముఖశర్మ అభినందించారు.

ఇదే వేదికపై గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ స్వరకల్పన చేసి గానం చేసిన “శివయోగం”, బాలమురళీకృష్ణ శిష్యులు డి.వి.మోహనకృష్ణ స్వరకల్పన చేసి గానం చేసిన “శివమంత్రము” అనే ధ్వని ముద్రికలను షణ్ముఖశర్మ ఆవిష్కరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*