జీవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణి

హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా జీవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాలలో పంపిణి చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

భారత జాతి సమైక్యతకు ప్రతీకగా లోక్ మాన్య బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన గణేష్ ఉత్సవాలు ప్రజలలో చైతన్యానికి, ధార్మిక విలువల పట్ల వారిలో అవగాహన కలిగించడానికి ప్రతీకగా నిలుస్తున్నాయని జీవై ఫౌండేషన్ వ్యవస్థాపకులు గజ్జల యోగానంద్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా ప్రజల మధ్య సామరస్యానికి వినాయక ఉత్సవాలు సాక్షిగా నిలుస్తున్నాయని తెలిపారు. పండుగల్లో సోదర భావంతో పాల్గొని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో ప్రజలు అందరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, ఇతర జాగ్రత్తలను పాటిస్తూ, పర్యావరణంకు దోహదపడే విధంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని జీవై ఫౌండేషన్ ఆకాంక్షించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*