తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ వినాయక చవితి పూజ

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి పూజ ఘనంగా జరిగింది. జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది భక్తులు ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. ఈ పూజ వేడుకను ఫేస్ బుక్ ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా సుమారు 2 వేల మంది తమ ఇంటి నుంచి వీక్షించి శ్రీ వినాయకుని ఆశీర్వాదం పొందారు. సకల విఘ్నాలు తొలగి అందరిపై వినాయకుడి ఆశీస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా కోరల నుంచి కాపాడాలని వినాయకుడిని కోరారు. ఈ పూజను మహబూబ్ నగర్‌కు చెందిన పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ, ఇరువంటి పవన్ కుమార్ శర్మ, శశాంక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా గర్రేపల్లి కస్తూరి, నంగునూరి వెంకట రమణ, రోజారమణి బొడ్ల, నల్ల దీప, కల్వ లక్ష్మణ్ రాజు, గార్లపాటి మాధురి, నడికట్ల భాస్కర్ వ్యవహరించారు.

TCSS శ్రీ వినాయక చవితి పూజ 2020

TCSS శ్రీ వినాయక చవితి పూజ 2020

Posted by Telangana Cultural Society (Singapore) on Friday, August 21, 2020

సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు, గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్. ఎమ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్ శ్రీ వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ వినాయక చవితి పూజhttp://go.phot.re/V3GXHThank you www.eekshanam.comSpecial thanks to all participants.Happy Vinayaka Chaviti to all

Posted by Telangana Cultural Society (Singapore) on Saturday, August 22, 2020

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*