
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి నటుడు మోహన్ బాబు అదిరిపోయే గిఫ్ట్ పంపాడు. చెక్కతో తయారు చేసిన హ్యార్లీ డేవిడ్సన్ బైక్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా పంపాడు. ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.
చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్. @KChiruTweets pic.twitter.com/TQ4CqAkGgc
— Mohan Babu M (@themohanbabu) August 22, 2020
మోహన్‌బాబు గిఫ్ట్ తనకెంతో నచ్చిందని, కానుకలో అతడి రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయంటూ చిరు ట్వీటర్లో పేర్కొన్నారు.
నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి… … … Thank you @themohanbabu 🤗 pic.twitter.com/8ROLZ6yfwI
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2020
చిరంజీవి, మోహన్ బాబు కలిసి అనేక హిట్ సినిమాల్లో నటించారు.
Be the first to comment