
ఇస్లామాబాద్: 1993 ముంబై పేలుళ్ల దోషి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాక్ తొలిసారిగా అంగీకరించింది. దావూద్ కరాచీలో ఉంటోన్న మూడు అడ్రస్‌లు కూడా వెల్లడించింది. అయితే దావూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మాత్రం ఇమ్రాన్ ఖాన్ సర్కారు నిరాకరించింది. తాజాగా జరిగిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో తమ దేశంలో ఉంటోన్న 88మంది ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించిన పేర్లను ప్రకటించింది. దావూద్ ఆస్తులే పాక్‌లో ఉన్నాయని, దావూద్ లేడని ఇమ్రాన్ సర్కారు బుకాయిస్తోంది.
1993 ముంబై పేలుళ్ల తర్వాత దావూద్ పాకిస్థాన్‌కు పారిపోయాడు. పాక్ ప్రభుత్వం అతడికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తోంది. అనేక సంవత్సరాలుగా దావూద్ పాక్‌లోనే ఉన్నాడని మీడియా వెల్లడిస్తున్నా పాక్ ప్రభుత్వం మాత్రం ఒప్పుకోలేదు. అయితే తొలిసారి దావూద్ తమ వద్దే ఉన్నాడని అంగీకరించింది. దావూద్ వద్ద 14 దేశాల పాస్‌పోర్టులున్నాయి. డ్రగ్స్ మాఫియా, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించడం, భారత్‌ను అస్థిరం చేయడం దావూద్ ప్రధాన వ్యాపకాలు.
గతంలో ఓ సారి దావూద్‌ను పాకిస్థాన్‌లోనే లేపేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన టీమ్‌తో యత్నించారని నిఘావర్గాలు అంటుంటాయి. అయితే ఆ ప్రయత్నం అనుకోని అవాంతరాల వల్ల సక్సెస్ కాలేదని ప్రచారం ఉంది.
లాడెన్‌ను అమెరికా కమెండోలు పాకిస్థాన్‌లో చంపేసినట్లుగా దావూద్‌ను కూడా లేపేసే అవకాశం కోసం భారత నిఘావర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయని తెలుస్తోంది. ఇతర ఉగ్రవాద సంస్థల బాస్‌లైన హఫిజ్ సయీద్, మసూద్ అజహర్ తదిరులను టార్గెట్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. దావూద్ తమ దగ్గరే ఉన్నాడని పాకిస్థాన్ తొలిసారిగా అంగీకరించడంతో అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాల ద్వారా ఇమ్రాన్ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు మోదీ సర్కారు యత్నిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడి భారీ విధ్వంసం సృష్టించిన భారత బలగాలు దావూద్ గ్యాంగ్‌ను కూడా తుదముట్టించగలిగే శక్తి కలిగి ఉన్నాయని నిఘావర్గాలు విశ్వాసంగా ఉన్నాయి.
1993 ముంబై పేలుళ్ల ఘటనలో 257 మంది చనిపోయారు. గాయపడ్డ 1400మందిలో అనేక మంది వికలాంగులయ్యారు.
Be the first to comment