సోనియా రాజీనామా!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. 20 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీలో అధినాయకత్వ మార్పు కోరుతూ తనకు లేఖ రాయడంతో ఆమె రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తన సన్నిహితులతో రాజీనామా చేస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం. పూర్తి స్థాయి, సమర్థ నాయకత్వం అవసరమని నేతలు గట్టిగా వాదించారు. అయితే అందరం కలిసి కొత్త అధ్యక్షుడిని వెతుకుదామని సోనియా సూచించినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా రాజీనామాను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

మరోవైపు రాహుల్‌ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైకి ససేమిరా అంటున్నా… అంతా ఒకతాటిపైకి వస్తే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*