తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ కొరొనా హెల్త్ బులిటెన్ విడుదైంది. మొదటిసారి కేసులు 3వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో 3018 కొరొనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1 11 688గా నమోదైంది. కొత్తగా 10 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 788కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25 685కు చేరుకుంది. 24 గంటల్లో 29 146 శాంపిల్స్ సేకరించారు.

GHMC పరిధిలో 475, కరీంనగర్- 127, ఖమ్మం 161, మంచిర్యాల- 103, మేడ్చెల్- 204, నల్గొండ- 190, నిజామాబాద్- 136, రంగారెడ్డి- 247, వరంగల్ అర్బన్- 139 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో 19 113 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*