వి’భిన్న’రూప గణపయ్య.. మీరు మునుపెన్నడూ చూసి ఉండని ఆలయాలు..

బెంగళూరు: మన సువిశాల భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. గణపతి గుళ్లకు కొదవేలేదు. వీటిల్లో కొన్ని ఆలయాల గురించి ప్రత్యేకoగా చెప్పుకోవాలి. మొదటిది … తల లేకుండా దర్శనం ఇచ్చే గణపయ్య. పరమేశ్వరుడు కోపంతో వినాయకుడి తల నరికిన సంఘటనకి ఇది గుర్తుగా చెప్పుకోవచ్చు. కేదర్‌నాథ్ మార్గంలో, మందాకినీ నది ప్రవాహం పక్కన ప్రకృతి ఒడిలో ఈ ముండ్కటియా ఆలయం వుంది.

మరొకటి నరరూప వినాయకుడు. ఏనుగు తలతో ప్రతిచోట కనిపించే రూపంలో కాకుండా… తన సహజ రూపులో ఇక్కడ బొజ్జ గణపయ్య దర్శనం ఇస్తాడు. అంటే… పార్వతి దేవి స్వయంగా తయారుచేసిన రూపురేఖలతో. ఈ ఆది వినాయక ఆలయం తమిళనాడు.. తిలతర్పానపురిలోని ముక్తిఈశ్వరార్ ఆలయంలో వుంది.

మరొక ఆలయం తమిళనాడులోని కన్యాకుమారి దగ్గర్లోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో వుంది. ఈశ్వరుడి ఆలయంలో వుండే మూల విరాట్ వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి రంగు మారతాడు.

మార్చ్ నుంచి జూన్ వరకు నలుపు రంగులోకి, జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెలుపులోకి మారతాడు. ఈ అద్భుతం జరుగుతున్నప్పుడు అక్కడి నీటి కొలను కూడా రంగు మారడం విశేషం. గణపయ్య నల్లగా మారితే నీళ్లు తెల్లగా… గణపయ్య తెల్లగా మారితే నీళ్లు నల్లగా మారతాయి.

https://tamilnadu-favtourism.blogspot.com/2018/01/adhisaya-vinayakar-temple-mahadevar-temple-keralapuram-kanyakumari.html

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*