రామకృష్ణా మఠంలో ఈ నెల 10, 11న ప్రత్యేక కార్యక్రమాలు

హైదరాబాద్: భాగ్యనగరం రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 21వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా రెండు రోజుల వేడుక జరగనుంది. ఈ నెల 10, 11 తేదీల్లో ఈ వేడుకలు ఉంటాయి. ఈ నెల 10న బేలూరు రామకృష్ణ మఠం, మిషన్ ఉపాధ్యక్షుడు స్వామి గౌతమానంద ఆశీ: ప్రసంగంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 10న ఉదయం పదిన్నరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆన్‌లైన్ ద్వారా ప్రసంగిస్తారు.

11వ తేదీన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తమ సందేశమిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మందిని రెండు దశాబ్దాలుగా ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్న ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ 21వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ముఖ్యంగా స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతరానికి, భవిష్యత్ తరాలకు అందించేందుకు విఐహెచ్ఈ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రస్తుతం స్వామి బోధమయానంద సారధ్యంలో ఈ సంస్థ యువతకు మార్గదర్శిగా నిలుస్తోంది. బాల వికాస్ పేరుతో చిన్నారులను కూడా తీర్చిదిద్దుతోంది. వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించడంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించే అనేక ప్రాక్టికల్ కార్యక్రమాలను రూపొందిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*