సాహితీ సమితి లైవ్ కార్యక్రమంలో ప్రసంగించనున్న భారతీయం సత్యవాణి

హైదరాబాద్: ‘అమ్మ ఒడి.. జాతీయ భావాల బడి’ పేరుతో జాతీయ సాహిత్య పరిషత్ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భారతీయం సత్యవాణి పాల్గొంటారు. ఫేస్ బుక్‌ లైవ్‌లో ఆమె ప్రసంగిస్తారు. సెప్టెంబర్ మూడున (గురువారం) సాయంత్రం 6.00 గంటల నుంచి 7.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

దేశభక్తికి పునాది అమ్మ ఒడిలోనే పడుతుందని.. శివాజీ, అల్లూరి లాంటి వీర యోధులు అలా రూపుదిద్దుకున్నవారేనని నిర్వాహకులు వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా చూడవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సాహిత్యాభిలాష ఉన్నవారు జాతీయ సాహిత్య పరిషత్ పేజీని ఫాలో కావాలని వేణుగోపాల్ సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*