
సింగపూర్: అందాలతార జమున రమణారావుకు “భానుమతీరామకృష్ణ జాతీయ పురస్కార” ప్రదానం చేశారు. “వంశీ ఇంటర్నేషనల్” మరియు “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ వారి సంయుక్త నిర్వహణలో భానుమతి రామకృష్ణ 96వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం, అంతర్జాలం ద్వారా నిర్వహింపబడన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. జమున మనుమడు రాఘవేంద్ర చేతుల మీదుగా అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ.. భానుమతి వంటి అగ్రతార యొక్క ప్రభావం తనపై చాలా ఉందని, అటువంటి మహోన్నత మైన బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి పేరుతో తను అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, అదికూడా తన మనవడి చేతుల మీదుగా ఈ సత్కారాన్ని అందుకోవడం తనకు మరింత ఆనందాన్ని కలిగింపజేసిందని తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరూ జమునను అభినందిస్తూ భానుమతికి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా భానుమతి, జమున నటించి, పాడిన పాటలను, భారత్ నుంచి శివశంకరి గీతాంజలి, బాలకామేశ్వరరావు, సుజారమణ, నాగలక్ష్మి, సింగపూర్ నుంచి విద్య గూడూరు, అమెరికా నుంచి రాధిక నోరి ఆలపించి అలరించారు. లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు వీణపై భానుమతి, జమున గారి పాటలను అద్భుతంగా పలికించారు.
ఈ కార్యక్రమానికి రాధిక మంగిపూడి, సింగపూర్, వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ సభను సింగపూర్ నుంచి స్వయంగా భానుమతి గారి సోదరి ఆకెళ్ళ యోగీశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ గేయ రచయిత భువనచంద్ర, లండన్ నుంచి కవి రచయిత డాక్టర్ జొన్నలగడ్డ మూర్తి, ఆస్ట్రేలియా నుంచి ‘తెలుగు అసోసియేషన్ సిడ్నీ’ అధ్యక్షులు సతీష్ వరద రాజు, ‘తెలుగు వాహిని’ సంపాదకురాలు విజయ గొల్లపూడి, మారిషస్ నుండి తెలుగు రేడియో వ్యాఖ్యాత సంజీవ నరసింహప్పడు, “దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక” అధ్యక్షులు రాపోలు సీతారామరాజు, మలేషియా తెలుగు సంఘం ప్రతినిధి సరికొండ రేఖ, సింగపూర్ నుంచి వేమూరి అరుణ్ కుమార్, ఘంటసాల గానసభ అధ్యక్షులు డాక్టర్ కె వి రావ్, అమెరికా గానకోకిల శారద ఆకునూరి, హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు జయ పీసపాటి, అబుదాబి నుండి చింతగుంట ఉదయ పద్మ, సినీరచయిత్రి బలభద్రపాత్రుని రమణి, అమెరికా వ్యాలీ వేదిక వ్యవస్థాపకురాలు శారదా కాశీ వజ్ఝల, అమెరికా నుండి జయశ్రీ తేలు కుంట్ల, గుణ ఎస్ కొమ్మారెడ్డి, ఆళ్ల భాస్కర్ రెడ్డి, వంశీ పౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ తెన్నేటి సుధ, వేగేశ్న ఫౌండేషన్ వైస్ చైర్మన్ సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.
Be the first to comment