నటుడు ప్రకాశ్ రెడ్డి మరణంపై మోదీ, షా, ఇతర ప్రముఖుల సంతాపం

హైదరాబాద్: నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. తన ఇంట్లోనే ఈ తెల్లవారుజామున ఆయన బాత్‌రూమ్‌లో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 74 సంవత్సరాల జయప్రకాశ్ రెడ్డి కొంతకాలంగా గుంటూరులోనే ఉంటున్నారు.

1988లో బ్రహ్మపుత్రుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి శత్రువు, లారీ డ్రైవర్‌, బొబ్బిలిరాజా, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడి పంబ తదిరత సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు. రాయలసీమ యాసలో ఆయన డైలాగ్స్‌ చెప్పేవారు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి ప్రశంసలు పొందారు.

జయప్రకాశ్ రెడ్డి మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని, ఆయన మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటని మోదీ చెప్పారు. జయప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

జయప్రకాష్ రెడ్డి గారి అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాప సందేశంలో పేర్కొన్నారు. పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన స్థానం భర్తీ చేయలేనిదంటూ ట్వీట్ చేశారు.

ఇతర ప్రముఖులు కూడా జయప్రకాశ్ రెడ్డి మృతిపై సంతాపం వెలిబుచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*