వాయుసేనలోకి రఫెల్ యుద్ధ విమానాలు… అంబాలా ఎయిర్‌బేస్ వద్ద పండుగ వాతావరణం

అంబాలా: రఫెల్ యుద్ధ విమానాలు వాయుసేనలో భాగమయ్యాయి. హర్యానా అంబాలా ఎయిర్‌బేస్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, త్రిదళాధిపతి బిపిన్ రావత్ తదితరుల సమక్షంలో సర్వధర్మ పూజలు జరిగాయి.

అనంతరం యుద్ధ విమానాలు వాయుసేన గోల్డెన్ యూరోస్ 17వ స్క్వాడ్రన్‌లో భాగమైపోయాయి.

ఈ సందర్భంగా యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

2016లో భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 36 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి దశలో 5 విమానాలు ఈ ఏడాది జులై 29న భారత్‌లోకి ప్రవేశించాయి.

మిగతా రఫెల్ యుద్ధ విమానాలను కూడా భారత అవసరాలకు తగ్గట్లుగా తయారుచేయించుకోవాలని నిర్ణయించారు.

ప్రస్తుతం అత్యంత అధునాతన యుద్ధ విమానాలుగా పేరున్న రఫెల్ యుద్ద విమానాలను అంబాలా ఎయిర్‌‌బేస్‌లో మోహరించడం ద్వారా భారత్ అప్రమత్తంగా వ్యవహరించినట్లైంది. వాస్తవాధీనరేఖ వెంబడి ఉద్రిక్తత నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అన్ని యత్నాలూ చేస్తోంది. ఎల్‌ఏసీ వెంబడి రఫెల్ యుద్ధ విమానాలతో పాటు మిగతా యుద్ధ విమానాలను, హెలికాఫ్టర్లను భారత్ మోహరించింది. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ నుంచి భారత్ అత్యంత అధునాతనమైన ఆయుధ సామాగ్రిని, క్షిపణి రక్షక వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*