
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా వామరాజు సత్యమూర్తిని నియమించడంపై సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారధి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సింగపూర్ నుంచి ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వామరాజు సత్యమూర్తి సింగపూర్లో తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులుగా ఎన్నో సేవలు అందించారని కవుటూరు చెప్పారు. తెలుగు సమాజ శ్రేయస్సు కోసం, తెలుగువారి సంస్కృతి పరిరక్షణకు నిరంతరం పాటుపడ్డారని తెలిపారు. కళారాధకుడైన సత్యమూర్తి తమకు గురుతుల్యులని, కోశాధికారిగా ఆయనకు గౌరవస్థానం దక్కడం తమకు ఆనందంగా ఉందన్నారు.
సింగపూర్లో ఉండే తెలుగు వారందరి తరఫున రత్న కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. సత్యమూర్తి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని, ఆయన సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం కావాలని కాంక్షించారు.
Be the first to comment