తెలుగు సినిమా… ఒకానొక సృజనాత్మక దర్శకుడు..!

#మురళీ_గంధర్వ
#ఒక_అమ్మాయితో
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సందర్భంగా..

మురళీ గంధర్వ సినిమాను ప్రేమిస్తాడు. సినిమాలు చూడటం, సినిమాల గురించి మాట్లాడటం, సినిమాల గురించి వినడం, సినిమాల గురించి తెలుసుకోవడం అతని జీవితం అయిపోయింది. అవును సినిమా ఇప్పుడు తన జీవితం.

2011 చివరలో సంగీత దర్శకుడు రవి కళ్యాణ్ ద్వారా మురళీ గంధర్వను కలిశాను. ఆయన అప్పుడు ‘గుడ్ మార్నింగ్'(2012) అనే సినిమా చేస్తున్నారు. ఆయన చేయబోతున్న స్క్రిప్ట్ గురించి ముఖ్యంగా చిత్రానువాదం, పాత్రల ఔచిత్యం గురించి చెబుతూ పాటలు ఎలా కావాలో చెప్పాడు. అప్పుడే అనుకున్నాను. మురళీ గంధర్వ లో ఒక సృజనాత్మక దర్శకుడని. ఆ సినిమాను ఎలా తీస్తాను అని చెప్పాడో.. అంతకంటే గొప్పగా తీశాడు. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాకు ఉత్తమ గాయనిగా గీతా మాధురికి నంది అవార్డు కూడా వచ్చింది. మురళిలో ఒక మంచి దర్శకుడు మాత్రమే కాదు మంచి రచయిత ఉన్నాడు. మంచి నృత్యదర్శకుడు ఉన్నాడు.

అతడికి సినిమా రూపకల్పనకు సంబంధించిన ప్రతి విషయం కూలంకషంగా తెలుసు. నటులకు సన్నివేశం వివరించడంలో గాని, వారి నుంచి నటనను రాబట్టుకునే విషయంలో గాని అత్యంత శ్రద్ధ చూపుతాడు. సినిమాకు స్క్రిప్టు ఆయువుపట్టు అనే సంగతి తనకు బాగా తెలుసు. అందుకే కథను గొప్పగా తయారు చేసుకుంటాడు. అతని కథలో స్క్రీన్ప్లే ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉంటుంది. సంభాషణలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. పాత్రలకు తగ్గ నటులను ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. అంతేకాకుండా వారికి తాను సృష్టించిన పాత్రలో ఎలా ఒదిగి పోవాలో నేర్పిస్తాడు. తాను సినిమా తీయడానికి సిద్ధం అయిన తర్వాత చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. కాగితం మీద రాసుకున్న దాన్ని అంతకంటే గొప్పగా చిత్రీకరిస్తాడు.

ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. చాలా ప్రశాంతంగా సినిమా తీస్తాడు. ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు అంటే.. ప్రశాంతంగా ఉన్నప్పుడే కొత్తగా ఆలోచిస్తాం కదా అంటాడు. అలాంటి మురళీ గంధర్వ నుండి మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. అందులో రెండవ సినిమా
#ఒక_అమ్మాయితో..!

– మౌనశ్రీ మల్లిక్, గీత రచయిత

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*