
హైదరాబాద్: ప్రముఖకవి, సినీగీత రచయిత మౌనశ్రీ మల్లిక్ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయానికి వస్తే ఆయన ఒకవైపు సినిమాలకు పాటలు రాస్తూనే మాటీవీలో ప్రసారమవుతున్న కోయిలమ్మ సీరియల్లో 500 పాటలకు పైగా రాసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారు నిర్మిస్తున్న కోయిలమ్మ సీరియల్ గత నాలుగున్నర సంవత్సరాలుగా స్టార్ మా లో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి విదితమే. స్వతహాగా రాఘవేంద్రరావు మ్యూజిక్ లవర్ కావడం వలన కోయిలమ్మలో సుమారు ఐదు వందల పాటలు రాయించారు. ఇందులో సంగీత ప్రధానమైన పాటలు, భక్తి పాటలు, శృంగార పాటలు, అమ్మ పాటలు, దేశభక్తి పాటలు, ప్రబోధాత్మక పాటలు ఇలా పలు వైవిధ్యభరిత గీతాలు ప్రసారం అయ్యాయి. కోయిలమ్మ సీరియల్ పాటల ద్వారా ప్రేక్షకులకు రీచ్ కావడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం.
సంగీత దర్శకుడు సాయి మధుకర్, దర్శకుడు మాధవ్, నిర్వహణ పద్మజ, మాటల రచయిత గంగోత్రి విశ్వనాథ్, స్క్రీన్ ప్లే రచయిత్రి ఉషారాణి, సింగర్స్ సాయి చరణ్, హరిణి, ప్రోగ్రామర్ కమల్ కుమార్, శ్రీకాంత్ కాటంరెడ్డి, భాస్కర్ పోకల వంటి తదితర మిత్రుల సహకారంతో వందలాది పాటలు రాయగలనని మౌనశ్రీ మల్లిక్ తెలిపారు. ముఖ్యంగా కె రాఘవేంద్ర రావుకు, చంద్రబోస్,సంగీత దర్శకుడు సాయి మధుకర్‌కు, హీరో సాయి కిరణ్ రామ్‌కు, తేజస్విని గౌడ శ్రీలత, మానస్, అమర్, ఆర్కె టెలీ షోకు పరిచయం చేసిన మ్యూజిక్ ఇంచార్జ్ యాదాగౌడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మనం కూడా మౌనశ్రీ మల్లిక్ మరిన్ని గీతాలు రాసి, మంచి గీత రచయితగా పేరు తెచ్చుకోవాలని శుభాకాంక్షలు తెలుపుదాం.
Be the first to comment