ఒక కవి శబ్దభేది *అనాహత* కవిత్వం

*కరువు అంటే*
*ఎండిపోయి రాలిపోయి*
*ప్రకృతి కళ తప్పడం కాదు*
*మనుషుల ప్రాణాలు కళ్ళలోకి రావడం*

ఈ మనుషుల ప్రాణాలు కళ్ళలోకి రావడం ఏమిటీ?
నిస్సహాయతతో మనిషి చివరి క్షణాల్లో ఉన్నప్పుడు దేహంలోని అణువణువులో ఉన్న ప్రాణాలు కళ్ళలోకి రావడం. పంచప్రాణాలు కంటి గూటిలోకి చేరి మరణ వాంగ్మూలం కూడా ఇవ్వలేని దుస్థితిని ఒక్క వాక్యంలో రాసి పడేసాడు. ఇలాంటి ఒక్క వాక్యం కోసం ఏ కవి ఐనా పరితపించాలి అనిపించింది.
ఈ కవి రాసిన ప్రతి కవితలో జీవితం కన్పించింది.జీవితం తాలూకు నొప్పి కనిపించింది. ఇంతటి నొప్పిని ఎలా భరిస్తున్నాడంటే –
కవిత్వమనే తాత్విక తైలాన్ని పూసుకుంటున్నాడు కదా…

జీవితాన్ని తాత్వికతకు అన్వయించినప్పుడు దాని బరువు ఊహించనంతగా పెరుగుతుందనే విషయాన్ని రవీంద్రసూరి కనిపెట్టగలిగాడు కాబట్టే ఎంతో నిగూఢమైన అర్థం కలిగినటువంటి *’అనాహత’* అనే పేరు పెట్టాడు అనిపిస్తుంది.

*-మౌనశ్రీ మల్లిక్* సినీగేయ రచయిత

ప్రతులకు:
Price:100
For copies:
*Ravindrasoori Namala*
*8-1-136/A/129,Marutinagar*
*Shaikpet, Hyderabad*
*Telangana* -5000089
Mobile: 9848321079

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*