జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి.. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి: రేడియో జాకీ ప్రవళిక

టాప్ స్టార్స్ తో నటించిన బ్యూటీ
మైక్ తో మదిని తట్టే క్యూటీ
యాక్ట్ చేసినా.. డబ్బింగ్ చెప్పినా…
పరకాయ ప్రవేశం చేస్తుంది రేడియా జాకీ ప్రెట్టి ప్రవళిక. ఎంచుకున్న ప్రతి రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రవళికతో ఈక్షణం ఇంటర్వ్యూ.

హాయ్ ప్రవళిక చుక్కల….

మల్టీ రోల్స్ చేసే మీ గురించి చెప్తారా?

హాయ్. మొదటగా నేను ఒక బ్యాంకు ఉద్యోగిని. ఆ తర్వాత టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్.

మీ ఫ్యామిలీ?

నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. పక్కా హైదరాబాదీ. నా బెస్ట్ హాఫ్ శ్రీహర్ష – సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పాప శ్రీఆద్య.

ముందుగా మీ ఎడ్యుకేషన్ గురించి. బ్యాంకు జాబ్ ఎలా వ‌చ్చింది?

లైఫ్ లో మనం చాలా అనుకుంటాం. కానీ లైఫ్ మన కోసం ప్లాన్ ఆల్రెడీ చేసి ఉంచుతుంది అనడానికి నేనే ఉదాహరణ. డైటీషియన్ అవ్వాలనుకుని న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేరాను .సబ్జెక్టు నాకు చాలా నచ్చింది . ఫైనల్ ఇయర్ లో ఉన్నపుడు నాన్న మనోహర్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయమని చెప్పడంతో.. జస్ట్ ప్రాక్టీస్ కోసం SBI రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ ఓకే అయినట్టు మెసేజ్ వస్తే అస్సలు నమ్మలేదు. ఇంటర్వ్యూకి నిరాస‌క్తితోనే వెళ్ళా.. సెలెక్ట్ అయ్యా. డైటీషియన్ అవుదాం అనుకున్న నాకు, “బ్యాంకు జాబ్ రావటం మాములు కాదు. వొదులుకోకు” అని అందరు సజెస్ట్ చేశారు. అలా 19 ఏళ్లకే SBI అసోసియేట్ గా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడే జాయిన్ అయ్యాను. ఆ తర్వాత డిగ్రీ ఫైనల్స్ పూర్తి చేశాను. బ్యాంకింగ్ ఇంటరెస్టింగ్ గా అనిపించింది. బ్యాంకింగ్ కెరీర్ కి హెల్ఫ్‌ ఫుల్ గా ఉంటుందని MBA ఫైనాన్స్ డిస్టెన్సులో కంప్లీట్ చేసాను.


మరి రేడియో జాకీ ఎలా అయ్యారు?

SBI ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నప్పుడు కస్టమర్స్‌తో ఇంటరాక్షన్ ఉండేది. అప్పుడు అహ్మద్ అనే రెగ్యులర్ కస్టమర్ నా వాయిస్ బాగుంటుంది, ఆల్ ఇండియా రేడియో FM లో రేడియో జాకీ ఆడిషన్స్ ఉన్నాయని, ట్రై చేయమని చెప్పడం జరిగింది. నాన్న ఎంకరేజ్మెంట్ తో ట్రై చేశా.. సెలెక్ట్ అయిపోయా .. ఇదిగో ఇన్నేళ్లుగా RJ గా చేస్తున్నాను.

సో, మీ బ్యాంకు కస్టమర్ అహ్మద్ సలహాతో RJ అయ్యారన్న మాట. ఈ విషయం తెలిసి ఆయన ఎలా ఫీల్ అయ్యారు?

RJ గా సెలెక్ట్ అయ్యాక.. అహ్మద్ కు స్పెషల్ థాంక్స్ చెప్పాను. మంచి ట్రీట్ కూడా ఇచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

రేడియో జాకీ కెరీర్ గురించి?

నా రేడియో కెరీర్ స్టార్ట్ అయ్యింది ఆల్ ఇండియా రేడియో రెయిన్బో FM 101.9 తో. రేడియో జాకీగా 2011 డిసెంబర్ లో జాయిన్ అయ్యాను. ఇప్పటి వరకు చేస్తూనే వున్నాను. ఆల్ ఇండియా రేడియో.. ఒక డివైన్ ప్లేస్ నాకు. గొప్ప గొప్ప కళాకారుల్ని కలిసే అవకాశం ఇచ్చింది. ఇటు వంటి గొప్ప గవర్నమెంట్ సంస్థలో చేయడం గర్వంగా అనిపిస్తుంది. బాధ్యతని పెంచింది.

ప్రస్తుతం ఏ షో చేస్తున్నారు?

ప్రతి గురువారం సాయంకాలం 6 to 9 గుడ్ ఈవినింగ్ ట్విన్సిటీస్ ప్రోగ్రాము చేసేదాన్ని. కుదిరినపుడల్లా మార్నింగ్ షోస్ కూడా చేసాను. ప్రస్తుతానికి లీవ్ లో వున్నాను. కొన్ని రోజుల్లో ఐ విల్ బి బ్యాక్

రేడియో ఖుషిలో కూడా చేశారు కదా?

AIR లో వర్క్ చేసేటప్పుడు, 2013లో రేడియో ఖుషి – ఒక ఆన్లైన్ రేడియో లో మార్నింగ్ షో కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. అక్కడ స్క్రిప్ట్ అక్కర్లేకుండా ….స్పాంటేనియస్ గా మైక్ ముందు గలగలా మాట్లాడేయాలి. ఆ ఎక్స్పీరియన్స్ కోసమే కొన్ని నెలలు రేడియో ఖుషి లో మార్నింగ్ షో చేసాను. లాస్ ఏంజెల్స్ వారితో కనెక్ట్ అయ్యాను. అలా ఇంటర్నేషనల్ లిసేనేర్స్ తో కనెక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. అదో డిఫరెంట్ జోష్. నాలో కాంఫిడెన్స్ నింపిoది.

మీ టాపిక్ సెలక్షన్ ఎలా ఉంటుంది?

షో టైంకి ఎన్నో టాపిక్స్ అనుకుంటాను. మొదట నన్ను నేను శ్రోతల స్థానంలో ఉంచుకొని ఆలోచిస్తా, ఏ టాపిక్ ఆ టైం, సిచ్యుయేషన్ కి సూట్ అవుతుందో చూసుకుని, ఇన్ఫర్మేటివ్, ఇన్స్‌పైరింగ్‌‌, ఎంటర్టైనింగ్ ఉండేలా చూసుకుని ఫైనల్ చేస్తా.


శ్రోతలతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది?

ఎనర్జీ డ్రింక్ లా అనిపిస్తుంది. రేడియో వినటం వరకు ఓకే కానీ ఓ అడుగు ముందుకు వేసి మనం ఇచ్చే టాపిక్స్ పై మాట్లాడ్డం, అందుకోసం వెయిట్ చేసి మరీ కాల్ చేసే కాలర్స్ చాలా వాల్యూయేబుల్ షో కి. నీ వాయిస్ స్వీట్ గా ఉంటుంది, కేవలం నీ గొంతు వినడానికే కాల్ చేశాను, అనే కాలర్స్ చాలానే ఉంటారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు, అన్ని రకాల రంగాల్లో పని చేసేవారితో మాట్లాడటం, వాళ్ళు టాపిక్ కి ఆక్టివ్ గా రెస్పాండ్ అవటం…రెట్టింపు ఎనర్జీని ఇస్తుంది.

View this post on Instagram

#clickwiththenature #jamesbondisland #thailand

A post shared by Pravalika Chukkala (@pravalikachukkala) on

మీ ఫ్యాన్స్ గురించి?

ఫ్యాన్స్… అంత పెద్ద పదం కాదుగానీ, నా షోస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. బర్త్ డే కి కాల్ చేసి విష్ చేస్తారు, సోషల్ మీడియాలో ఫాలో అవుతారు. ఒకసారి.. రేడియో స్టేషన్ బయట ఒక శ్రోత కలిసి “మీ వాయిస్ కి అడిక్ట్ అయిపోయా”అన్నారు, రెగ్యులర్ లిసేనేర్స్ ఒక రోజు రెయిన్బో FM బడే రోజు షో కి సడన్ గా ఎంట్రీ ఇచ్చి.. బొకే చాకోలెట్స్ గిఫ్ట్స్ తెచ్చి సర్ప్రైజ్ చేశారు. అది మర్చిపోలేను.

బాగా పేరు తెచ్చిన షో ఏది

గుడ్ ఈవినింగ్ ట్విన్ సిటీస్ షో… ప్రైమ్ టైం కావటం వల్ల చాలా మంది లిజనర్స్ ఉంటారు. అందులో నా ప్రతి షోలో నేను పాటలతో పాటు … ఒక మాంచి కామెడీ బిట్ ప్లే చేస్తాను. దానికి తగ్గ jocktalk జోడించి చెప్తాను…. “విని హాయిగా నవ్వుకున్నాం ” “మీరు వేసే కామెడీ బిట్ కోసం వన్ వీక్ వరకు షో కోసం వెయిట్ చేస్తాము” అనే వారు చాలానే ఉన్నారు.


గుర్తు ఉండిపోయిన శ్రోత

అప్పుడప్పుడు బ్లైండ్ స్కూల్‌ స్టూడెంట్స్ కాల్ చేస్తుంటారు. “నీ షో వింటే ఎనర్జీ వస్తుంది అక్క” అంటారు. ఎపుడో ఓసారి సక్సెస్ టాపిక్ పై మాట్లాడినపుడు ” నేను బ్లైండ్ కానీ… నేనేదైనా చేయగలను .. నీ టాపిక్ నాకు కాంఫిడెన్స్ ఇచ్చింది ” అన్న శ్రోతని మర్చిపోలేను.


అటు బ్యాంకు జాబ్ ఇటు RJ.. టైం ఎలా మేనేజ్ చేస్తారు?

బ్యాంకు ప‌నివేళ‌లు ఎపుడు డిస్టర్బ్ చేసుకోలేదు. ఆఫీస్ అయ్యాక… రేడియోలో ఈవెనింగ్ ప్రోగ్రాము హోస్ట్ చేస్తాను.ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా చేస్తాను. బ్యాంకులో మా హెడ్స్, కొలీగ్స్ చాలా ఎంకరేజింగ్. రేడియో లో RJ గా సెలెక్ట్ అవగానే బ్యాంకులో మా కొలీగ్స్ అందరూ ఆనందించారు. షోస్ ని ఫాలో అయ్యి ఫీడ్ బ్యాక్ ఇస్తారు. వాళ్ళ ఎంక‌రేజ్‌మెంట్‌ తోనే ఇదంతా సాధ్యం. అందరికి థ్యాంక్స్‌ చెప్పాలి. టాలెంట్ ని SBI ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంది.

మీ టాలీవుడ్ ఎంట్రీ గురించి

బ్యాంకు జాబ్, RJ ఛాన్స్ లానే ఫస్ట్ మూవీ అవకాశం కూడా అనుకోకుండానే వచ్చింది. జత కలిసే రేడియో ఫ్రెండ్ RJ కర్నె దత్ .. తాను వర్క్ చేస్తున్న కొత్త మూవీకి రేడియో జాకీ రోల్ చేస్తావా అని అడిగారు. మూవీ అనగానే ఫస్ట్ ఆలోచించాను. బట్ ఇంట్లో వాళ్ళు “ఏముంది ! రేడియోలో మాట్లాడేది, సినిమాలో మాట్లాడతావ్ అంతే గా.. ట్రై చేసేయ్ ” అనేసారు. ఆ ఎంక‌రేజ్‌మెంట్‌ తో అలా కెమెరా ముందుకి వచ్చాను. డైరెక్టర్ రాకేష్ శశి డైరెక్షన్లో 2015 రిలీజ్డ్ “జత కలిసే” మూవీ లో హీరోయిన్ తేజస్వి ఫ్రెండ్.. RedFM రేడియో జాకీ రోల్ తో తెరంగేట్రం చేసాను.

భూమిక థియేటర్

యాక్టింగ్ నేనెప్పుడూ చేయాలనుకోలేదు. అందుకే ఫస్ట్ మువీ తర్వాత నెక్స్ట్ మూవీకి 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఈ బ్రేక్ పీరియడ్ లో మరొక రేడియో ఫ్రెండ్ RJ హర్ష ద్వారా.. భూమిక థియేటర్ గ్రూపులో ఫ్రెషర్స్ కి థియేటర్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తున్నారని తెల్సి జాయిన్ అయ్యాను. 3 నెలల్లో చాలా నేర్చుకున్నాను.

మెంటల్ మదిలో

అప్పుడే థియేటర్ ఫ్రెండ్ దినేష్, తను వర్క్ చేసే మూవీలో హీరో. ఫ్రెండ్ రోల్ కి రిఫ‌ర్ చేశాడు. అలా రాజకందుకూరి ప్రొడ్యూస్ చేసిన, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరక్షన్లో 2017లో “మెంటల్ మదిలో ” సినిమాలో హీరో ముంబై ఆఫీస్ ఫ్రెండ్ రోల్ చేశాను.

MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి )

MCA మూవీలో సాయిపల్లవి ఫ్రెండ్ రోల్ లో నటించాను.

మహానటి

నెక్స్ట్ సినిమా నేను ఎప్పటికి మర్చిపోలేనిది. వైజయంతి మూవీస్ వాళ్ళు ‘మహానటి ‘ చిత్రం కోసం ఏదో చిన్న రోల్ ఆఫర్ చేశారు. ఆ తర్వాత అప్పటి హీరోయిన్ రాజశ్రీ రోల్ మీది, జెమినీ గణేశన్ తో కలిసి నటించే అవకాశం ఉంటుంది. సినిమాలో జెమినీ -రాజశ్రీ గారు అప్పటి సినిమాల్లో నటించిన సీన్స్ ఉంటాయి. పోస్టర్స్ ఉంటాయి అన్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌ నా ఫేవరెట్. అతనితో స్క్రీన్ స్పేస్, అందులో మహానటి మూవీలో అనగానే చాలా ఎక్సైట్ అయ్యాను. బట్ షూట్ టైంలో చేంజెస్ వల్ల ఇంకా ఎడిటింగ్ తర్వాత చూస్తే … ఆ క్యారెక్టర్, హీరోయిన్ రాజశ్రీ అని ఫైనల్ ఔట్‌పుట్‌ లో ప్రొజెక్ట్ అవలేదు. అది డిజ‌ప్పాయింట్‌ చేసింది. కానీ షూటింగ్ లో ఎంత చేసినా.. ఎడిటింగ్ మన డెస్టినీ డిసైడ్ చేస్తుందని ఆ తర్వాత తెల్సింది. బట్ షూట్ టైం అందరం ఫుల్ ఎంజాయ్ చేసాము. దుల్క‌ర్ తో చాలా సేపు మాట్లాడే ఛాన్స్ ఒచ్చింది.

ఆఫ్టర్ షాట్ కీర్తి సురేష్ వచ్చి గట్టిగా హగ్ చేసుకుంది.

విజేత

https://www.mxplayer.in/movie/watch-vijetha-movie-online-451e2575bf5fb3111aca70722b34f19d?watch=true

జతకలిసే సినిమా డైరెక్టర్ రాకేష్ శశి .. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘విజేత’ లో క్యారెక్టర్ ఆఫర్ చేశారు. ఇందులో రిచ్ ఫ్యామిలీ యంగ్ కోడలి రోల్ లో హ్యాపీ డేస్ ఫేమ్ ‘ఆదర్శ్ బాలకృష్ణ’ వైఫ్ క్యారెక్టర్ లో నటించాను.


NTR బయోపిక్

మహానటి లాంటి గొప్ప బయోపిక్ తర్వాత.. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే అవకాశం రావటం కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ గారి పెద్ద కోడలి రోల్ లో నటించాను.

ఎన్టీఆర్ మహానాయకుడులో, లెజెండ్ బాలకృష్ణ గారితో, విద్యాబాలన్ లాంటి గొప్ప నటులతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోడం చాలా గ్రేట్ ఫీలింగ్. షూట్ టైంలో బాలకృష్ణ గారు, విద్యాబాలన్ గారు భలే సరదాగా మాట్లాడేవారు. ఎన్టీఆర్ బయోపిక్ నటులతో, ఎన్టీఆర్ గారి రియల్ ఫ్యామిలీతో … షూట్ టైం ని చాలా ఎంజాయ్ చేసాను.

సైరా నరసింహ రెడ్డి

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టేవారు ఒక్కసారన్నా చిరంజీవిని కలవాలని.. .మాట్లాడాలని ఎంతగానో వెయిట్ చేస్తారు. అలాంటిది చిరంజీవి నటించే సినిమాలో యాక్ట్ చేసే అవకాశం రావటం, సూపర్బ్ ఫీలింగ్.


మహానటికి సెలెక్ట్ అయిన నన్ను ఆడిషన్ లేకుండానే సెలెక్ట్ చేశారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి నన్ను నయనతార క్లోజ్ ఫ్రెండ్ రోల్ కి సెలెక్ట్ చేశారు. చిరంజీవి, నయనతార, తమన్నాలాంటి టాప్ యాక్టర్స్ తో షూట్ ఎక్స్పీరియన్స్ మార్వెలస్. అద్భుతమైన సెట్టింగ్స్ మధ్యలో, 18వ శ‌తాబ్ద‌పు డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ లో షూట్ టైం మెమొరబుల్ .షూట్ టైంలో అసిస్టెంట్ కెమరామెన్ సాంబ చాలా హెల్ప్ చేసారు. ఈ సినిమాలో ఒక సీన్లో చిరంజీవి, నయనతారతో నాదొక డైలాగ్ సీన్ ఎండ్ ప్రోడక్ట్ లో ఎడిట్ అయిపోయింది . ఎడిట్ వల్ల నా సినిమాల్లో ఎన్నో సీన్స్ మిస్ అయ్యాను. బట్ సైరా వల్ల చాలా గుర్తింపు ఒచ్చింది.

సైరా లాంటి బిగ్ బడ్జెట్ బయోపిక్ ఎప్పటికి నా కెరీర్లో మైల్ స్టోన్. వరసగా బియోపిక్స్ కి సెలెక్ట్ అయినా నన్ను ఫ్రెండ్స్ ‘బయోపిక్ క్వీన్ ‘ అనటం స్టార్ట్ చేశారు. ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ కి థాంక్స్ చెప్పాలి. యాక్టింగ్ విషయంలో థియేటర్ ఆర్టిస్ట్, ట్రైనర్, అప్ కమింగ్ హీరో “ప్రిథ్వి” చాలా గైడ్ చేసాడు.


థియేటర్ ప్లే కూడా చేసారనుకుంటా?

అవును. బిస్క‌ట్‌ బేబీ అని ఒక సూపర్ ప్లే. రేడియో జాకీ, థియేటర్ ప్లే డైరెక్టర్ దీనబాంధవా.. రేడియో జాకీలందరితో కలిసి ఈ కామెడీ ప్లే ని ప్లాన్ చేసి.. నాకో మంచి రోల్ ఇచ్చారు. ఇది నా మొదటి థియేటర్ ప్లే..చాలా సరదాగా అనిపించింది.

డబ్బింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లారు?

రేడియో ఫ్రెండ్ RJ రాజేష్ నన్ను డబ్బింగ్స్ కి పరిచయం చేసాడు. వాయిస్ మాడులేష‌న్ ట్రిక్స్ ఎన్నో నేర్పించారు. అలా కొన్ని యాడ్స్ , మూవీస్ కి వాయిస్ అందించా. 2014లో రిలీజ్ అయిన “మళ్ళీ రాదోయ్ లైఫ్ ” మూవీ లో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పాను. రాము కుమార్ డైరెక్ట్ చేసిన మూవీ “గణపతి బప్పా మోరియా” లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పాను.

టీవీ ఛానెళ్లలో కూడా యాంకర్‌గా చేశారు కదా?

అవును, ఎన్‌ టీవీ, మా టీవీలో ప్రాపర్టీ షోస్ చేశాను.

ఇన్ని వేర్వేరు రంగాలలో ఎలా చేయగలుగుతున్నారు?

100% ఫ్యామిలీ సపోర్ట్. స్పెషల్లీ అమ్మ నాన్న. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. కొత్తది చేయాలి నేర్చుకోవాలన్న ఉత్సాహం వాళ్లలో ఎప్పుడు ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా.. కుదిరిందల్లా చేయాలి అని ఎంకరేజ్ చేస్తారు. అత్తయ్య మామయ్య కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు . మా వారు శ్రీ హర్ష నాకు పెద్ద సపోర్ట్ . ఏదయినా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు టెన్షన్ అనిపిస్తే.. తనతో ఫోన్లో మాట్లాడతాను. నాలో ఆత్మ విశ్వాసం నింపేస్తారు. మా బ్యాంకు వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా ఉండటం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నాను.

మీకు వచ్చిన బిగ్ కంప్లిమెంట్ ఫ్రొమ్

బ్యాంక్ బిగ్ ప్రోగ్రామ్స్ అన్నిటికి యాంకరింగ్ కి పిలుస్తారు “SBI కి నువ్వు టీవీ యాంకర్ సుమ లాగా ” అన్న పొగడ్తలు వచ్చాయ్.

మీ హాబీస్

పెయింటింగ్.. నాలో ప్రశాంతతను నింపుతుంది. ఎక్కువ టైం దొరికితే ఫస్ట్ అదే చేస్తా. అమ్మ సుధారాణి ఇన్స్పిరేషన్ దీనికి.
ఇక మ్యూజిక్.. నా ఆల్ టైం ఫేవరెట్. అందుకే శ్రోతలకంటే ఎక్కువగా నా పాటల్ని నేను ఎంజాయ్ చేస్తాను. డాన్స్.. నా హ్యాపీనెస్ కి ఎక్స్ప్రెషన్. మూవీస్ అండ్ మూవీస్ అండ్ మూవీస్…. రోజుల తరబడి సినిమాలు చూస్తూ ఉండిపోవచ్చేమో అనిపిస్తుంది. న్యూట్రిషన్ స్టూడెంట్ కాబట్టి కుకింగ్ అంటే చాలా ఇష్టం.

జీవితంలో సాధించేశానని అనుకున్నది ఏది?

ఇప్పటిదాకా సాధించినవన్నీ దేవుడి దయ, డెస్టినీ అనుకుంటాను. చేసినవన్నీ చాలా ఇష్టం తో చేశా కాబట్టే సంతృప్తి ఉంది. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. గోల్స్ కి లిమిట్ లేదు. ఎలాంటి మంచి అవకాశం వచ్చినా…వదులుకోను. నా బెస్ట్ నేను చేస్తా. ఫలితం సంగతి ఆ తర్వాత.

సమీప భవిష్యత్ లో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలని అనుకుంటున్నారు?

న్యూ జనరేషన్ సినిమా కాన్సెప్ట్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అద్భుతమైన స్కిల్స్ తో సినిమాలను తీస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ లో క్యారెక్టర్ ఓరియెంటెడ్ – పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్స్ కోసం వెయిటింగ్. “గుడ్ యాక్ట్రెస్”, “గుడ్ RJ”, “గుడ్ బ్యాంకర్”, “గుడ్ మదర్ “, “గుడ్ హ్యూమన్ ” గా పేరుంటే చాలు.

ఈ జర్నీలో ఏమైనా ఛాన్సెస్ మిస్ అయ్యారా?

టైం సరిపోక చాలానే వదులుకోవాల్సి వచ్చింది. సీరియల్స్ కి లీడ్ రోల్ కోసం అడిగారు. కానీ అంత టైమ్ కేటాయించలేక మిస్ చేసుకున్నాను. కొన్ని మూవీస్ కి లీడ్ రోల్ గా అడిగారు.. కంఫర్ట్ అనిపించక వదులుకున్నాను. ఇలా చాలానే.

మీ వీక్నెస్

మై ఫ్యామిలీ – స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్

ఫ్రీ టైములో ఏమి చేస్తారు?

మా పాప శ్రీఆద్య, నా రెఫ్రెషమెంట్ తనే. ఖాళీ ఉన్నప్పుడల్లా అమ్మకి కాస్త రెస్ట్ ఇచ్చి, నేను అన్నయ్య కొత్త రెసిపీస్ కుకింగ్ ట్రై చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ తో షాపింగ్.


ఫ్యూచర్లో మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం?

కొన్ని మూవీస్ లో క్యారెక్టర్ల కోసం అప్రోచ్ అయ్యారు. షూట్స్ స్టార్ట్ అవ్వాలి. ఒక ఎనర్జీ డ్రింక్ యాడ్ లో యాక్ట్ చేశాను. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది.

జీవితంలో మర్చిపోలేని వ్యక్తి?

చదువుకునే రోజుల్లో… కాలేజీ ఫీ చలాన్ పే చేయటానికి SBH, సుల్తాన్ బజార్ బ్రాంచికి ఫ్రెండ్స్ అందరం వెళ్ళేవాళ్ళం. క్యాషియర్ పేరు కుమార్. మాతో సరదాగా మాట్లాడుతూ… “Aim big..aim for bank job ” అని ప్రతిసారి చెప్తూ ఉండేవారు. SBI రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసినప్పుడు కుమార్‌ను కలిసి ఆయన సలహాలు సూచనలు తీసుకున్నాను. ఒక విధంగా ఆయన గైడెన్స్ నాకు బ్యాంకు జాబ్ రావడానికి ఉపయోగపడింది. కుమార్ అంకుల్ భౌతికoగా మా మధ్య లేకపోయినా ఆయనకు జీవితాంతం రుణపడి వుంటాను.

RJలు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్.

RJ అవ్వాలనుకుంటే మాట్లాడాలన్న ఉత్సాహం ఉండాలి. ఆక్టివ్, హ్యాపీ, ఎనర్జిటిక్ గా ఉండాలి. అప్ డేటెడ్ గా ఉండాలి. కరెంటు అఫైర్స్ తెలిసి ఉండాలి. భాష మీద గ్రిప్ ఉండాలి. సినిమాలకి, పాటలకి, సంబంధించిన సమాచారం తెలిసి ఉండాలి. విజ్ఞానానికి వినోదాన్ని జోడించి సృజనాత్మకంగా చెప్పగలగాలి. Rj is an Infotainer. RJ is a performer.


చివరగా మీరు నమ్మే సిద్ధాంతం ?

పేరెంట్స్ కి ఎప్పుడు కృతజ్ఞత గా ఫీల్ అవ్వాలి. జీవితంలో గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ఎప్పుడు ఒకేలా (stable) వుండాలి. భవిష్యత్ మన కోసం ఏమి ప్లాన్ చేసిందో తెలియదు. మనసుకి నచ్చిందే చేయాలి . అప్పుడు లైఫ్ లో ఎప్పుడు రిగ్రెట్ అవ్వరు. ప్రతి క్షణం నచ్చింది చేస్తూ… చేసేది ఇష్టపడుతూ లైఫ్ ని ఆస్వాదించాలి. ఏ ఏజ్ లో అయిన లివ్ యంగ్.. ఫీల్ యంగ్… అప్పుడు ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.

-మంజీత బందెల(ఈక్షణం జర్నలిస్ట్, బెంగళూరు),
-విజయ్ కొత్తూరు (ఈక్షణం జర్నలిస్ట్, విజయవాడ 94934 39425).

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*