ఎందుku? ఏమిti? ఎలాga?… (విచారం)

1. రాత్రి చాలా పద్ధతిగా కూర్చుని రేపు చేయాల్సిన పనులు లిస్ట్ అంతా రాసుకున్నాను.
హమ్మయ్య… అనుకుని పాటలు వింటూ పడుకున్నాను.
తెల్లారింది…
లేచాను…
Ok…
కాఫీ తాగాను…
కానీ లిస్ట్ ప్రకారం చేయాల్సిన పనులు ఏవీ ముందుకు కదలడం లేదు.
చేయాలనే ఉత్సాహం లేదు…
Mood లేదు.
ఏదో ఉదాసీనత,  విచారం…
ఎందుకో తెలీదు…
దాంతో సాయంత్రం అయ్యే సరికి నా మీద నాకు వొళ్ళు మండిపోయింది.
కోపం వచ్చేసింది.
నన్ను మళ్ళీ ‘విచారం’ లోకి తోసేసింది… 
ఈరోజు కూడా నా ‘లక్ష్యం’ నెరవేరలేదని…
ఈ situation  ఎంతమందికి ఎదురైంది? ఎదురవుతోంది?

సరే….

2. బావా ఎందుకంత విచారంగా వున్నావు?
-రాధా మొహం అంత చిన్నబోయింది?  ఏమి కష్టం వచ్చింది?
-ఏరా/ఏమే/ ఏమ్మా/ఎం నాన్నా/ ఏం చిట్టితల్లి అలా వున్నావు?  ఏమైంది?
-అమ్మా లేదా నాన్నా ఎందుకంత కుమిలి పోతున్నారు?  మేమున్నాం కదా?
-గోపీ, అంత ఆలోచించకు నేనున్నా కదా?
విచారం గురించిన ఈ questions అన్నీ ఒకప్పుడు సినిమాల్లో, లేదా బయట ఇద్దరి మధ్య చాలా తరచుగా వినిపించేవి. సమాధానం కూడా అసలు విషయంతో తిన్నగా  ఉండేది. ఈ మధ్య కాలంలో నేనైతే ఎక్కడా వినలేదు.

విచారం అనే emotion ఉండడం ఎంత  అవసరమో , దాన్ని  express కూడా చేయాలి. చేయడంలో తప్పు లేదు, చాలా సహజం అని భావించేవారు ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని కప్పి పుచ్చడానికి చేయని ప్రయత్నం లేదు.

ఒక్కసారి చదవడం ఆపి ఆలోచన చేయండి!
మీరు last time ఎప్పుడు ఎవరితో నాకు బాధగా లేదా విచారంగా వుంది అని చెప్పారో?
అలా చెప్పినందుకు మిమ్మల్ని దూరం పెట్టారా?
గేలి చేశారా?
మాట సాయం చేశారా?
Topic మార్చారా?

“విచారం” అనే emotion గురించి, ఈ వారం
ఎందుku?  ఏమిti?  ఎలాga?

వేదన, నిరాశ,  నిరుత్సాహం,  అసంతృప్తి,  కలత,  అనుభూతి, అసౌకర్యం, ఒంటరితనం,  ప్రేమ, షాక్ బాధ ఇవన్నీ విచారం ఎమోషన్ కి, ముద్దు పేర్లు, మారుపేర్లు.

*ఎందుku?*
అసలు విచారం ఎందుకు కలుగుతుంది ?

సైంటిఫిక్ గా చెప్పాలంటే…
మెదడులోని రెండు specific areas లో cells మధ్య అతి వేగంగా, ఎక్కువగా జరిగే సంభాషణ.
దాన్లో పాల్గొనేవాళ్ళు,  “జ్ఞాపకాలు – భావాలు” అంటే memories and emotions.

సింపుల్ గా చెప్పాలంటే…
– చిన్నతనంలో ఎదురైన బలమైన సంఘటనలు, ఒక విధంగా జీవితాంతం మనం ఎదురు తిరగకుండా చేస్తాయి. ప్రతి దాంట్లో విచారము, అసంతృప్తి, వేదన,  కలత కనిపించేలా చేస్తాయి….
– చిన్నప్పట్నుంచీ విచారం యొక్క మారు పేర్లు తెలీక పోవడం, తెలిసినా avoid  చేయడం, దాన్ని  కప్పిపుచ్చడం కోసం కోపం, చిరాకు  లేదా సదా చిరు మందహాసం ఆశ్రయించడం….
– విచారంగా ఉండకూడదు, అది negative emotion  అని చిన్నప్పట్నుంచి వింటూ  ఉండడంవల్ల…
– ఒకవేళ విచారం ఉన్నా బయట పడకూడదు లేదా నివారించాలి లేదా లేనట్టు నటించాలి అని tune అయిపోవడం వల్లా..
– దాన్ని మర్యాదగా ట్రీట్ చేయకుండా చులకనగా చూడడం….
– దాని ఉద్దేశ్యం తెలుసుకోకపోవడం.
మరి విచారం అనే emotion కి కూడా ఒక ఉద్దేశ్యం  ఉంటుంది కదా!
దాన్ని పట్టించుకోకపోతే ఊరుకుంటుందా?
నేను మిమ్మల్ని డిప్రెషన్ లోకి తోసి తీరుతానని శపధం చేస్తుంది.
అంతవరకూ వెళ్లకూడదంటే విచారం  యొక్క ఉద్దేశ్యం, లక్ష్యం తెలుసుకోవడం ఒక్కటే మార్గం!
Life లో ఎదురయ్యే కష్టాలను, నష్టాలను సజీవంగా,  సహజీవనంతో,  ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడటం sad అనే emotion గారి  అసలు purpose. నిజానికి మన దృష్టిని,  గ్రహణశక్తిని,  ఆలోచనా విధానాన్ని,  తాత్కాలికంగా ఆపి,
తర్వాత  చురుగ్గా ఉల్లాసంగా ఉండటానికి తోడ్పడుతుంది.

*ఏమిti ?*

విచారం అంటే నష్టం, కష్టం వల్ల కలిగే భావోద్వేగం. అంటే…
– కోలుకోలేని నష్టం
-ఒక particular  అవాంఛనీయ ఫలితం జరిగినపుడు.
-ఒక సంఘటన యొక్క అంచనా ద్వారా అసంతృప్తి.
-రాబోయే నష్టం

 వీటికి వ్యక్తిగత లక్షణాలు, యవ్వనం, ఆరోగ్యం,  చేజారిపోయిన అవకాశాలు, జరగని వాటి గురించి,  ఎపుడో జరిగిపోయిన జ్ఞాపకాల తాలూకు విచారం,  గత వైఫల్యాలు,  దురదృష్టవశాత్తు తీసుకున్న నిర్ణయాలు లేదా ఎంపిక  ఇవన్నీ తోడ్పడతాయి.

విచారానికి సంబంధించిన ‘కొన్ని’ భావోద్వేగాలు ఎలా ఉంటాయంటే…
-మీరు నష్టపోయి ఎవర్నైనా ఆరోపిస్తుంటే అది వేదన, కోపం.  
-జరిగిన నష్టానికి మీరే నిందించుకుంటే అది నిరాశ ,  షాక్. 
-మరొక వ్యక్తి పట్ల అభిమానాన్ని కోల్పోయారని/కోల్పోతున్నారని అనిపిస్తే, అది దుఃఖం, అసంతృప్తి,  కలత.
-భద్రత లేదా భద్రతను కోల్పోతే భయం లేదా ఆందోళన.
-ఆశ కోల్పోవడం నిరాశకు దారితీస్తుంది.
-పని time కి అవనపుడు నిరుత్సాహం, అసౌకర్యం..

ఇలా, చిన్నప్పటినుండి ఒక స్థాయిలో నిరంతరం, ప్రతిదాంట్లో పరాజయం చూడడానికి అలవాటు
పడిపోయినప్పుడు అది వాళ్ళ జీవన విధానంలో అంగీ ‘ఖారంగా’ మారి, బతకడం అలవాటు అయిపోయి, మార్చుకోలేకపొతే ..
అది ఉద్యోగం, స్నేహితులు, కుటుంబం, అవకాశాలు, డబ్బు, ఆఖరికి ఆరోగ్యం మీద కూడా పడుతుంది.

**ఎla* ?

ఎలాంటి ప్రయత్నాలతో బయట’పడొచ్చు’ ?
– విచారం అనే ఫీలింగ్ 2 వారాల కన్నా ఎక్కువ ఉండకుండా గమనించుకోవాలి.
– ఏడుస్తే తప్పులేదు. కాదు.
– తప్పించుకోడానికి overగా పని పెట్టేసుకోవద్దు.
– మీ మాతృభాష ఏదైతే ఆ భాషలో ఆ emotion కి  ఉండే పర్యాయ పదాలు అన్నీ మీరు నేర్చుకోండి. పిల్లలకు నేర్పించండి
– బాలేదు, ఏదోలా ఉంది, తెలీడం లేదు అనుకుంటే or మీ అనుకున్నవాళ్ళు అంటే ఆ specific భావాన్ని రాయించండి, లేదా మీరు రాయడం లో help చేయండి.
– physical exercise, సూర్యరశ్మి, పాదాలు మసాజ్.
(Accupressure mat మీద నిలబడినా చాలు)
– త్రాటక క్రియ అంటే eye exercises n candle gazing
– మెదడుని బుజ్జగించడం, అంటే ఒక టైం కేటాయించి ఆ టైం లోనే ఏ విషయం గురించి,  ఎంత సమయం ఆలోచించాలో అంతే ఆలోచన చేయడం. ఇది సాధనతో వస్తుంది
– sad అనే భావం ఎలా ఏర్పడుతుందంటే , ఒక కోరికకు.. ఆ కోరిక యొక్క యజమానత్వానికి మధ్య బంధం ఏర్పరుస్తుంది.
(Acts as Link between desire as well as ownership) 
అందుకని ఆ కోరిక మూలానికి వెళ్ళి , దాని పట్ల మన ownership ఎంత అని question చేసుకోగలిగితే మార్గం easy అవచ్చు. 
అలా చేసి ఉండవలసింది, ఉండుంటే బాగుండేది అన్న ఆలోచన నుండి బయట పడే chance ఉంది.
– అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎవరిని అడగదల్చుకున్నా, నిజాయితీగా,  అవహేళన చేయకుండా, చేస్తారన్నా పట్టించుకోకుండా,  మీ ఊహ జోడించకుండా, straight గా అడగండి. ఎందుకు వాళ్ళు అలా ఉంటున్నారో!
వారు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు లేదా పూర్తిగా మాట్లాడటం మానేయవచ్చు. కానీ వాళ్లలో ఆ ఆలోచన అయితే రేకెత్తించారు కదా.

అది చాలు.

ఇప్పటికి ఇంత చాలు.

మళ్ళీ కలుద్దాం.

స్రవంతి చాగంటి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*