
న్యూఢిల్లీ: రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లుల ఆమోదం సమయంలో రభస చేసిన ఎనిమిది మంది ఎంపీలను రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. వారం రోజుల పాటు సెషన్ అయిపోయేవరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో డెరెక్ ఓ బ్రెయిన్,సంజయ్ సింగ్, రాజు సతవ్, కేకే రాగేశ్, రిపున్ బొరా, డొలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమారన్ కరిమ్ ఉన్నారు.
Derek O Brien, Sanjay Singh, Raju Satav, KK Ragesh, Ripun Bora, Dola Sen, Syed Nazir Hussain and Elamaran Karim suspended for one week for unruly behaviour with the Chair: Rajya Sabha Chairman M Venkaiah Naidu pic.twitter.com/JUs9pjOXNu
— ANI (@ANI) September 21, 2020
నిన్న వ్యవసాయ రంగ బిల్లుల ఆమోదం సమయంలో వీరు బిల్లు పత్రాలను చించివేశారు. గట్టిగా కేకలు వేస్తూ రభస సృష్టించారు. డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ వారించినా వినలేదు. దీంతో మూజువాణి ఓటు ద్వారా బిల్లులను ఆమోదింపచేశారు.
సభలో సభ్యుల తీరుపై నిన్ననే ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్య అన్నంత పనీ చేశారు. సభ్యులు హుందాగా ప్రవర్తించకపోవడంతో పాటు రభస సృష్టించారని, చైర్మెన్ చెయిర్కు విలువ లేకుండా చేశారని వెంకయ్య మండిపడ్డారు. చివరకు ఆ ఎనిమిది ఎంపీలను వారం పాటు సస్పెండ్ చేశారు.
Eight members of the House are suspended for a week: Rajya Sabha Chairman M Venkaiah Naidu https://t.co/BSjWnK4lvf pic.twitter.com/TFY7KmfUbm
— ANI (@ANI) September 21, 2020
Be the first to comment