
హైదరాబాద్: ప్రముఖకవి, సినీగీత రచయిత మౌనశ్రీ మల్లిక్ మహాకవి కాళోజీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇదివరలో ఈ పురస్కారం సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ వంటి ప్రముఖులు అందుకోవడం విశేషం. గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు టెలివిజన్ రచయితల సంఘం ప్రతిష్టాత్మకంగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.
మల్లిక్ ఒకవైపు కవిత్వంతో పాటు టీవీ సీరియళ్లకు, సినిమాలకు పాటలు రాస్తున్నారు. ఇటీవల కోయిలమ్మ ఓకే సీరియల్లో ఐదు వందల పాటలు రాసి ప్రపంచ రికార్డు సృష్టించారు. మల్లిక్ కవితా రచనలో, గేయరచనలో విశేష కృషి చేయడం అభినందనీయమని అన్నారు.
టెలివిజన్ రచయితల సంఘం మల్లిక్ సాహిత్య యాత్ర అద్భుతమని అని భావిస్తూ కాళోజీ పురస్కారానికి ఎంపిక చేసింది.
సంస్థ అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, సీనియర్ రైటర్ తోటపల్లి సాయినాథ్, సినీగేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు, టీవీ రచయిత ఉషారాణి ఏకగ్రీవంగా మౌనశ్రీని ఎంపిక చేశారు. మల్లిక్ కు కాళోజీ పురస్కారం రావడం పట్ల సినీ పెద్దలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సి. నారాయణ రెడ్డి పురస్కారానికి ప్రముఖ కవి కాంచనపల్లి రాజేంద్ర రాజు, వానమామలై వరదాచార్యులు పురస్కారానికి తుమ్మూరి ఎంపికయ్యారు.
Be the first to comment