
తిరుపతి: తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి ఇష్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో గరుడ పక్షి ప్రత్యక్షమైంది. జిల్లా కోర్టు ఆవరణలో గరుడ పక్షి కనపడింది. ఎగరలేని స్థితిలో ఉన్న అరుదైన పక్షిని చూసిన న్యాయవాదులు మీడియాకు సమాచారమిచ్చారు. అంతేకాదు అరుదైన పక్షి అపస్మారక స్థితిలో కనపడటంతో వెంటనే తిరుపతి అటవీ సిబ్బందికి సమాచారం అందించారు.
అటవీ శాఖ అధికారి శంకర్ వచ్చి గరుడ పక్షిని ఎస్వీ జూకు తరలించారు. వైద్యం అందించి కోలుకున్న తరువాత శేషాచలంలో వదులుతామని చెప్పారు. పురాణాలలో చెప్పినట్లు తిరుమలలో గరుడ సేవ రోజు గరుడ పక్షి కనపడటం శ్రీవారి మహిమే అంటున్నారు.
Be the first to comment