ప‌క్క‌వాళ్ల‌పై కాదు.. నీపై నువ్వు దృష్టి పెట్టు.. త‌ప్ప‌‌క విజ‌యం సాధిస్తావ్‌..

అది రన్నింగ్ రేస్ లో ఫైనల్ రౌండ్..
అతని మీద బాగా ఆశలు ఉన్నాయి….
అమ్మ నాన్న చాలా కష్టపడి కోచింగ్ ఇప్పించారు….
కోచ్ స్టేట్ రన్నింగ్ ఛాంపియన్షిప్ కోసం కష్టపడి ప్రిపేర్ చేసాడు…
స్టేట్ రన్నింగ్ ఛాంపియన్షిప్ లో అది లాస్ట్ రౌండ్. పక్క గెలుస్తాడు అనుకున్న time…
పికప్ బాగా తీసుకున్నాడు…
ఇంకొక 10 సెకండ్స్ గ్యాప్ లో ఎవరో ముందుకు వచ్చి గెలిచేసారు….
అంత 10 సెకండ్s టైం లో జరిగిపోయింది….
అందరూ గెలిచిన అబ్బాయి బాగా రన్ చేసాడని …
ఓటమి గెలుపుకి రెండో మెట్టు అని ఒకటి కాదు…
ఓడిపోతే తప్పేం లేదు అని ఇలా చాలానే చెప్పారు…
ఎన్ని చెప్పిన నాకు కళ్ళు మాత్రం ఇంకొక విషయం మీద ఆగిపోయింది…
ఆ first 10 సెకండ్లోనే నేను ఉండిపోయాను.
Last పది సెకండ్స్ లో నేను గమనయించిన విషయం ఏంటంటే. పోటి మొదలు అవ్వక ముందు ఆ క్షణం లో ఎవరు వస్తున్నారు అని ఒక కంటితో పక్కకి చూసాడు. అంతే లాస్ట్ వరకు పక్కకి తప్పుకున్నాడు.
మన మీద దృష్టి లేకపోతే పక్క వాళ్ళ మీద దృష్టి పెరిగితే గెలుపు దూరమైపోతుంది….
గెలుపే కాదు ప్రశాంతత దూరం అవుతుంది…
మనశ్శాంతి దూరం అవుతుంది….
ఇది నేను కొత్తగా చెప్పట్లేదు…
బ్రెయిన్ కి ఉన్న ఒక గొప్ప శక్తి అది దేనిని ఫోకస్ చేస్తావో అదే జరుగుతుంది. నువ్వు వేరే వాళ్ళని మనసులో పెట్టుకుంటే వాల్లనే గెలిపిస్తావ్…

ఇంట్లో శాడిస్ట్ అత్త శాడిస్ట్ మొగుడు లేదంటే శాడిస్ట్ పెళ్ళాం ఉందా…
కూల్ గా వాళ్ళని బ్రెయిన్ లో ఫోకస్ నుంచి తీసేయాలి. చెప్పడం ఈజీ చెయ్యడం కష్టం అంటారా… అందుకే బ్రెయిన్ లో నుంచి తీసేయంటున్నా…
అంటే బయటకి వాళ్ళకి కనిపించేటట్టు డోర్ లు మూసుకుని లోపల కూర్చోమని కాదు…
హాయిగా మైండ్ లో క్లియర్ చేస్కోండి మీరు వాళ్ళ మాటల్ని వాళ్ళ నెగటివ్ మైండ్ సెట్ ని మాత్రమే నెగ్లెక్ట్ చెయ్యాలి…
మన కర్తవ్యాన్ని కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక మార్గం ఏంటంటే….
మంచి మనసు పెంచుకుంటే ఏది కావాలంటే దాన్ని ఫోకస్ చేయడం ఈజీ. ఇలా అర్ధం చేస్కోండి ఇంట్లో సామాను అవసరం మేరకు ఉంటే ఇల్లుని శుభ్రం గా ఉంచుకోడానికి సులువుగా ఉంటుంది బ్రెయిన్ కూడా అంతే…
మన రన్నింగ్ మనది.. అందులో బెస్ట్ గా చేద్దాం…
వేరే వాళ్ళని అంచనా కోసం కూడా అవసరం లేకపోతే చూడద్దు. మన జీవితానికి కావలసింది మాత్రం లోపలికి వెళ్ళాలి.
అది తిండి అయినా మాట అయినా… మనుషులు అయినా మన ప్రశాంతత పాడు చేసేవి ఏవి లోపలకి వెళ్ళకూడదు. అప్పుడు మీరే గమనిస్తారు జీవితం అద్భుతంగా మారుతుంది. ప్రశాంతంగా ఉంటే అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఎపుడు మీకు ఏ బాధ వచ్చిన ఎం కష్టమొచ్చినా ఒకటే ప్రశ్న వాళ్ళని ఎందుకు చూస్తున్నావు…
నిన్ను నువ్వు చూసుకో అని ప్రశ్న వేసుకోండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. నేను చెప్పేది నమ్మమనట్లేదు. ప్రయత్నం చేయమంటున్న. ట్రై చేయండి.

ఇలా కాకుండా మీకేమన్న అనుమానం ఉంటే ఎలాంటి సమస్యలున్నా నాకొక మెసేజ్ పెట్టండి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను….
ఫాలో అవుతానంటేనే సొల్యూషన్ అడగండి….

Anyone who want to ask can ask questions- Dr Harish, Hyderabad.(99499 62477)

View this post on Instagram

https://youtu.be/SbOa8Aa_u-0

A post shared by harish kumar tenneti (@rjharry198) on