బాలును మరిచిపోవడం సాధ్యమంటారా?: స్రవంతి చాగంటి

ఈ వారం నేను రాద్దాం అనుకున్న topic వేరు, రాస్తున్న topic వేరు.

ముందు బాలు గారి మరణ వార్త విని అయ్యో అనుకున్నాను…
తర్వాత సాయంత్రానికి దుఃఖం కమ్మేసింది.
గత 15 ఏళ్లగా రోజులో కనీసం మూడు నాలుగుగంటలు radio లేదా నా పర్సనల్ పాటల  list  వినే అలవాటు వున్న నాకు…
కలం కదలడం లేదంటే, మా నారాయణరావు గారు
SPB గారి గురించి రాయండి అని అన్నారు.
ఏమి రాయాలి?
నాకు బాలు గారు పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా కూడా తెలీదు. కలవలేదు.
కానీ వారి పాటలతో మాత్రం బాగా పరిచయం, జ్ఞాపకాలు ఉన్నాయి. అనుబంధం, అల్లిక ఉంది. 
కారణం?
ఒక్కసారి RJ గా,  నా 6 ఏళ్ల radio ప్రయాణం, జ్ఞాపకాలు, పాటలు, శ్రోతలు, వారి emotions అన్నీ గుర్తుకొచ్చాయి కనుక.
అసలు పాట ఎంజాయ్ చేయాలంటే నా ప్రకారం వయస్సు, noissu కాదు. మనస్సు కావాలి.
ఒక మంచి పాట, వినేవారి మనసు మీద వాలి, అది కలిగించే అనుభూతికి, మరేదీ సాటిరాదు.
Private FM stations మొదలైన 2006 లో,  Radio City లో ఒక ఏడాది పని చేశాను. 
ప్రతి ఆదివారం ఉండేది నా show.
Show పేరు 
‘Super Sunday with Sravanthi’.
Retro show.
అన్నీ పాత melodies వేసుకునే స్వేచ్ఛ ఆ show లోనే ఉండేది.
4 గంటల ఆ show లో,  సినిమా ఎలా మొదలైంది లాంటి కబుర్లు, పాత పాటలు నుండీ , తర్వాత అప్పటివరకు వరకు పాపులర్ అయిన అన్నీ అద్భుతమైన పాటలే!
చాలా శాతం బాలు గారివే.
Literal గా అప్పట్లో అన్నీ stations చాలా మటుకు ఆయన పాటలతో survive అయినవే !
ఆ పాటలు, వాటి వెనుక కధా కమామీషు, ఎందుku, ఏమిti, ఎla ఇవన్నీ మాట్లాడేదాన్ని.
పాత పాటలు బావుంటాయా, కొత్త పాటలు బాగుంటాయా అన్నది పక్కన పెడితే…
అసలు పాటలు ఎందుకు వింటామో తెలుసా.
ఏ పాట అయినాసరే,  మనల్ని ఆ కాలానికి తీసుకెళ్లి అప్పటి పరిసరాలను, సందర్భాన్ని, తీపి/చేదు  జ్ఞాపకాలని, ప్రేమని, మాధుర్యాన్ని అంతకన్నా ముఖ్యంగా, time to time ఉన్న బ్రిడ్జిని గుర్తు చేస్తుంది.
Exact గా అదే జరిగేది.
మధ్య మధ్యలో listeners కాల్ చేసి వారి భావాలు జ్ఞాపకాలు, facts పంచుకునేవారు.
నా వరకు విషయ వివరాలు క్లియర్ గా తెలుసుకోవడం కోసం విజయవాడ వెళ్లి  లెనిన్ సెంటర్ దగ్గర ఉన్న పాత బుక్ shops లో ‘విజయచిత్ర’ లాంటి పాత సినిమా magazines అన్నీ కొనుక్కుని వచ్చి, refer చేసి మాట్లాడేదాన్ని.
మరి కొన్ని అప్పటి DD న్యూస్ డైరెక్టర్ గా ఉన్న  RVV కృష్ణా రావు గారు, ఆయన పర్సనల్ లైబ్రరీ నుండి ఇచ్చిన information ఉండేది.
Google ఇంత active గా లేదు అప్పుడు.
2007 లో తెలుగు సినిమా పరిశ్రమ 75 వసంతాలు పూర్తి చేసుకుని, వజ్రోత్సవాలు చేసుకుంది.
ఆ  సందర్భంగా నేను, వంశీ కలిసి తెలుగు సినీ పరిశ్రమను పైకి తీసుకురావడంలో కృషి చేసిన   దాదాపు 20 మంది గురించి ఒక నలభై సెకండ్లలో మాట్లాడాము.
వారిలో బాలుగారి గురించి కూడా ఉంది.
ఎలా మర్చిపోగలను?
మరి దాదాపు 45 ఏళ్లగా బాలుగారి పాటలు లేకుండా లేవు.
ఆయన్ని మరిచిపోవడం సాధ్యమంటారా?
స్పందించే మనసున్న ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేదే  సినిమా పాట.
అలాంటి సినిమా పాటల్ని, దాదాపు ఏ రూపంలో అయినా, ఎప్పుడో ఒక్కసారి వినే అలవాటు ఉన్న అందరూ spb గారితో ఎదో ఒక సందర్భంలో ఒక్కసారైనా connect అయ్యే ఉంటారు.

వారందరి కోసం ఈ నా article. 

మళ్ళీ కలుద్దాం

స్రవంతి చాగంటి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*