రామకృష్ణ మఠం-వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఆదర్శ మహిళ’ ఆన్‌లైన్ కాంటెస్ట్

హైదరాబాద్: రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ‘ఆదర్శ మహిళ’ అనే పేరుతో ఆన్‌లైన్ కాంటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు యువత ఆసక్తి కనబరుస్తోంది. రామకృష్ణ మఠం, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కాంటెస్టును నిర్వహిస్తున్నాయి. విజేతకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందించనున్నారు. నవంబర్ 15న జరిగే ఈ పరీక్షలో విజేతలకు బంపర్ బహుమతులను కూడా అందజేయనున్నారు. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి క్యాష్ అవార్డ్స్ ఇవ్వనున్నారు. 50 మందిని ఎంపిక చేసి.. తొలి బహుమతి లక్ష రూపాయలతో పాటు ల్యాప్ టాప్, ద్వితీయ బహుమతిగా 75వేల రూపాయలతో పాటు ట్యాబ్లెట్, తృతీయ బహుమతిగా 50వేల రూపాయలతో పాటు ట్యాబ్లెట్ ఇవ్వనున్నారు. మిగిలిన 47 మందికి 10వేల రూపాయలతో పాటు వెయ్యి రూపాయల విలువ చేసే రామకృష్ణ, వివేకానందుల సాహిత్యాన్ని అందించనున్నారు. మొదటి ముగ్గురు విజేతలకు కూడా రామకృష్ణ, వివేకానందుల సాహిత్యాన్నిఇవ్వనున్నారు.

పరీక్షకు సన్నద్ధమయ్యే వాళ్లు ఆర్యజనని సంస్థ అందించే పుస్తకం, అలాగే ఆ సంస్థ వెబ్ సైట్‌‌ http://aaryajanani.org/ ను అనుసరించాలని నిర్వాహకులు తెలిపారు. పుస్తకం కోసం aaryajanani.2020@gmail.comకు వివరాలు పంపగలరు. మెయిల్‌కు మీ చిరునామా, వాట్సాప్ నంబర్ పంపితే…. వాట్సాప్ నంబర్‌కు క్యూఆర్ కోడ్ వస్తుంది. దాని ద్వారా రూ.50 చెల్లిస్తే… పుస్తకాన్ని పొందొచ్చు. ఈ పుస్తకం నుంచి సుమారు 80శాతం ప్రశ్నలు.. అలాగే వెబ్ సైట్ నుంచి 20శాతం ప్రశ్నలు రానున్నాయి. ఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి 100 మందికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. హిందీ/ఇంగ్లీషులలో ఉండే ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన మొదటి 50 మందిని విజేతలుగా ప్రకటిస్తారు.

పరీక్ష తేది: నవంబర్ 15, 2020
పరీక్ష సమయం: ఉదయం 9 గంటల నుంచి 10.30గంటల వరకు
వయో పరిమితి: 18 – 26 ఏళ్లు
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు – 8523009896, 9346746446

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*