దుబ్బాక ఉపఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి

దుబ్బాక ఉపఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి

జాతీయ పార్టీ ప్రకటన లాంచనమే.

ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది, బీజేపీ ని గెలిపిస్తామని ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు.

సర్వే లో బీజేపీ గెలుస్తుందని స్పష్టమైన రిపోర్ట్ ఉంది.

దుబ్బాక ఉప ఎన్నిక ఇంచార్జి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రకటన.

హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర కార్యదర్శి  , గత రెండు సార్లు పోటీ చేసిన రఘునందన్ రావు ప్రకటన లాంచనమే అని ఉప ఎన్నిక ఇంచార్జి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కార్యాలయంలో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  అధ్యక్షతన  సమీక్షా సమావేశం జరిగింది.  దుబ్బాక అసెంబ్లీ లోని ఎనిమిది మండలాల ఇంఛార్జీలు, సిద్దిపేట  ,మెదక్ జిల్లా అధ్యక్షులు , జిల్లా ఇంఛార్జీలు పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు.  కేసీఆర్ ప్రభుత్వం వ్యవహారం పై దుబ్బాక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, బీజేపీ ని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

రఘునందన్ రావు పోరాడే వ్యక్తి అని కేసీఆర్ కు దీటుగా ప్రశ్నించే వ్యక్తిగా ఆయనను గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారని  జితేందర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో  మీడియా సమావేశంలో వెల్లడించారు.  సిద్దిపేట, గజ్వెల్ లాగా దుబ్బాక ను ఎందుకు అభివృద్ధి చెయ్యడం లేదని ప్రజలు తెరాస పై ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు.  దుబ్బాక ప్రజలు రఘునందన్ రావు ను కోరుకుంటున్నారని , బీజేపీ కి ఓట్లు వెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ ఎన్నికలను పైసల తో గెలుస్తామని అనుకుంటున్నారు కానీ మా సర్వే లో స్పష్టంగా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

-ఎడ్ల సతీశ్ కుమార్, జర్నలిస్ట్(95055 55285)


Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*