స్వామి బోధమయానంద భగవద్గీత తరగతులపై యూత్ క్రేజ్

దోమలగూడ: భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడిచే భగవద్గీత తరగతులకు చక్కని ఆదరణ ఉంది. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టుగా యువతీయువకులకు ఆకట్టుకునేలా భగవద్గీతను స్వామి బోధమయానంద బోధిస్తున్నారు. ప్రతి శనివారం సాయంత్రం 5.45 గంటల నుంచి 6.40 గంటల వరకు జరిగే ఈ తరగతులను యూట్యూబ్‌లో వీక్షించవచ్చు. ఇవాళ 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంపై మాట్లాడనున్నారు. అందరూ ఆహ్వానితులే.

ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*