
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో అక్టోబర్ 04 న ఇక్కడి హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన TCSS రక్త దాన శిబిరం – 2020 విజయవంతం అయింది. వరుసగా గత పది సంవత్సరాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని TCSS నిర్వహిస్తుంది. సొసైటీ పిలుపు మేరకు సుమారు 40 మంది వరకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరం లో పాల్గొని రక్త దానం చేయడము జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంట వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా హెల్త్ అండ్ సైన్సు అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు మాట్లాడుతూ కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామాజిక దూరం పాటిస్తూ ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. మరియు ఎల్లప్పుడూ ఇలాంటి లాభాపేక్ష లేని సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ ని కొనియాడడం తో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా నంగునూరి వెంకట రమణ, గోనె నరేందర్, అనుపురం శ్రీనివాస్, పెరుకు శివ రాం ప్రసాద్ వ్యవహరించారు.
ఈ రక్తదాన సేవ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేసిన వారందరికి సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి, బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త మరియు ఇతర సభ్యులు, గడప రమేష్, దుర్గ ప్రసాద్ మంగలి, శివ ప్రసాద్ ఆవుల, ముదాం అశోక్, మరియు సొసైటీ పూర్వ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు బండా మాధవ రెడ్డి గార్లు ధన్యవాదాలు తెలియ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సారి ముందుకు వచ్చి రక్త దానం చేసిన మహిళలు బండా భార్గవి మరియు సవితేన పద్మజ నాయుడు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయని తెలిపారు.
Be the first to comment